15 ఏళ్ల తర్వాత కలిసి వర్క్ చేస్తున్న హీరో & డైరెక్టర్..

  • IndiaGlitz, [Friday,May 27 2016]

15 ఏళ్ల త‌ర్వాత ఓ హీరో, ఓ డైరెక్ట‌ర్ క‌లిసి వ‌ర్క్ చేస్తున్నారు. ఇంత‌కీ ఆ హీరో ఆ డైరెక్టర్ ఎవ‌ర‌నుకుంటున్నారా..? ఆ హీరో జ‌గ‌ప‌తి బాబు కాగా..డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్. అవును...వీరిద్ద‌రూ క‌లిసి బాచి చిత్రం చేసారు. ఇప్పుడు 15 ఏళ్ల త‌ర్వాత పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు న‌టిస్తుండ‌డం విశేషం. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ ఓ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. నిన్న‌టి నుంచి ఈ చిత్రం హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు.
టెంప‌ర్ చిత్రంలో పోసాని పోషించిన పాత్ర జ‌గ‌ప‌తికి బాగా న‌చ్చింద‌ట‌. ఇటీవ‌ల జ‌గ‌ప‌తి పూరితో టెంప‌ర్లో పోసాని పాత్ర బాగుంది అలాంటి పాత్ర ఏదైనా ఉంటే చెప్పు చేస్తాన‌ను అని చెప్పార‌ట‌. అప్పుడు పూరి మీరు అలాంటి పాత్ర చేస్తార‌నుకోలేదు. మీరు చేస్తార‌ని తెలిస్తే మీతోనే చేయించేవాడిని అన్నాడ‌ట‌. అందుక‌నే జ‌గ‌ప‌తి కోసం క‌ళ్యాణ్ రామ్ మూవీలో ఓ డిఫ‌రెంట్ రోల్ డిజైన్ చేసార‌ట పూరి. అది పూరి తాజా చిత్రంలో జ‌గ‌ప‌తి న‌టించ‌డం వెన‌క ఉన్న స్టోరీ. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని ద‌స‌రా కానుక‌గా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

More News

మురుగుదాస్ త‌ర్వాత మ‌హేష్ చేసే మూవీ ఇదే..

సూప‌ర్ స్టార్ మ‌హేష్ త్వ‌ర‌లో మురుగుదాస్ తో ఓ మూవీ చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతుంది.

ఫ్లాప్ డైరెక్ట‌ర్ కి మ‌రో ఛాన్స్ ఇచ్చిన రామ్

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ ప్లాప్ డైరెక్ట‌ర్ కి మ‌రో ఛాన్స్ ఇచ్చాడట‌. ఇంత‌కీ...ఆ ప్లాప్ డైరెక్ట‌ర్ ఎవ‌రంటే...క‌రుణాక‌ర‌న్. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో క‌రుణాకర‌న్ తెర‌కెక్కించిన చిత్రం తొలిప్రేమ‌. టాలీవుడ్ లో తొలిప్రేమ ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే.

అ ఆ కొత్త కథ తో తీసిన సినిమా కాదు..సింపుల్ స్టోరీతో తీసిన జెన్యూన్ ఫిల్మ్ - హీరో నితిన్

యువ హీరో నితిన్-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అ ఆ.

అఖిల్ సెకండ్ మూవీ డైరెక్టర్ ఇతనే..

అక్కినేని అఖిల్ తొలి చిత్రం ఆశించిన స్ధాయిలో విజయం సాధించక పోవడంతో రెండవ చిత్రం ఏ డైరెక్టర్ తో..?

సమంత పెళ్ళి గురించి నితిన్ కామెంట్..

ఏమాయ చేసావే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ సమంత.