యూత్ తో పాటు ఫ్యామిలీ అంతా చూసే సినిమా రొమాంటిక్ - హీరో ఆకాష్ పూరి
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ హీరో ఆకాష్ పూరి, అందాల హీరోయిన్ కేతిక శర్మ కాంబోలో వస్తోన్న ‘రొమాంటిక్’ చిత్రం అక్టోబర్ 29 విడుదల కాబోతోంది. పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. రొమాంటిక్ సినిమాను అనిల్ పాదురి తెరకెక్కించారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మంగళవారం హీరో ఆకాష్ పూరి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
మా నాన్న సక్సెస్‌ను నేను ఎంతగా ఎంజాయ్ చేస్తున్నానో.. నా సక్సెస్‌ను కూడా ఆయన అంతే ఎంజాయ్ చేయాలి. ఆ విజయం ఈ సినిమాతో వస్తుందా? వేరే ఏ సినిమాతోనైనా వస్తుందా? అని కాదు. నేను సక్సెస్ కొట్టాలి.. మా నాన్న కాలర్ ఎగరేయాలి.. ఎంజాయ్ చేయాలి. రొమాంటిక్ పట్ల నేను ఎంతో సంతృప్తిగా ఉన్నాను.
ప్రీ రిలీజ్ ఈవెంట్లోముందే ప్లాన్ చేసుకుని అలా మాట్లాడలేదు. ఆ టైంలో అనిపించింది చెప్పాను అంతే. పూరి పనైపోయిందని చాలా మంది అన్నారు.. నా పని కూడా అయిపోయిందని అన్నారు.. ఆ మాటలు వింటూ ఉండే వాడిని. కానీ ఇస్మార్ట్ శంకర్‌తో అంతా వెనక్కి వచ్చింది.
అనిల్ గారు నాన్న దగ్గర ఎన్నో ఏళ్ల నుంచి పని చేస్తున్నారు. ఆయన సీజీ డిపార్ట్మెంట్ చూసుకునే వారు. ఆయన దర్శకత్వం చేస్తారని, అందులో నేను హీరోగా నటిస్తాను అని మేం ఎప్పుడూ అనుకోలేదు. ఓ రోజు నాన్న గారు సడెన్‌గా పిలిచి ఈ సినిమాకు ఆకాష్ హీరో.. నువ్ దర్శకుడివి అని అనిల్‌తో అన్నారు. ఇద్దరం షాక్ అయ్యారు. అలా ఓ రెండు రోజులు కలిసి ట్రావెల్ అయ్యాం. తరువాత కనెక్ట్ అయిపోయాం.
మెహబూబా విడుదలైన ఆరు నెలలకు ఈ ప్రాజెక్ట్ మొదలైంది. ఇస్మార్ట్ శంకర్, రొమాంటిక్ ఒకే సమయంలో జరిగాయి. ఇస్మార్ట్ పెద్ద హిట్ అవ్వడంతో రొమాంటిక్ ఇంకా బాగా తీయాలని అనుకున్నాం. అప్పుడు రమ్యకృష్ణ గారు ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. ఆమె రావడంతో సినిమా స్థాయి మారిపోయింది. అలా సినిమాను పూర్తి చేసే సమయానికి లాక్డౌన్ వచ్చింది. మొత్తానికి అలా ఆలస్యమైంది.
మధ్యలో చాలా భయమేసింది. సినిమాను ఓటీటీకి ఇచ్చేస్తారా? అని అనుకున్నాను.. కరోనా ఎప్పుడు పోతుందా? అని అనుకున్నాను. ఎందుకంటే ఇది అందరితో కలిసి థియేటర్లో కూర్చుని చూసే సినిమా. క్రాక్, ఉప్పెన, లవ్ స్టోరీ వంటి సినిమాలు మళ్లీ థియేటర్లకు ఊపిరిపోశాయి. ఏది ఏమైనా సరే థియేటర్లకు వచ్చి చిత్రాలు చూస్తామని చాటి చెప్పిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com