విశాల్ మూవీలో విలన్ గా నటిస్తున్న హీరో....
Send us your feedback to audioarticles@vaarta.com
విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్లో సినిమాలను నిర్మిస్తూ, నటిస్తున్న విశాల్ ఇప్పుడు ఒక్కడొచ్చాడు(తమిళంలో కత్తిసండై) సినిమాను నవంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. అలాగే ఇప్పుడు మిస్కిన్ దర్శకత్వంలో తుప్పరివాలన్ అనే మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాలతో పాటు మిత్రన్ అనే డెబ్యూ డైరెక్టర్ దర్శకత్వంలో ఇరుండు తిరై అనే సినిమాలో యాక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాలో మరో హీరో ఆర్య విలన్‌గా చేస్తున్నాడు. గతంలో విశాల్, ఆర్య హీరోలుగా బాల దర్శకత్వంలో వాడు-వీడు సినిమా చేశారు. ఇప్పుడు ఇరుంబు తిరై సినిమాలో ఆర్య విలన్‌గా చేయనున్నాడు. తర్వలోనే సినిమా సెట్స్‌లోకి వెళ్లనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments