రీమేక్ లో హీరో ఆది...
Send us your feedback to audioarticles@vaarta.com
సాయికుమార్ తనయుడు హీరో ఆది కెరీర్ ప్రారంభంలో ప్రేమకావాలి, లవ్ లీ చిత్రాలతో మంచి విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. రీసెంట్గా చుట్టాలబ్బాయి చిత్రంతో మన ముందుకు వచ్చి సందడి చేశాడు. త్వరలోనే ఓ తమిళ చిత్రం రీమేక్‌లో నటించడానికి రెడీ అవుతున్నాడు. సీనియర్ తమిళ నటుడు మురళి తనయుడు అధర్వ నటించిన ఈట్టి చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో హీరో ఆది నటించనున్నాడు. రక్తహీనతతో బాధపడే ఆటగాడి కథతో రూపొందిన ఈ సినిమా తమిళంలో మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు తెలుగు రీమేక్‌లో ఆది నటించే అవకాశాలు కనపడుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments