పూరి - కళ్యాణ్ రామ్ మూవీ టైటిల్ ఇదే..
Send us your feedback to audioarticles@vaarta.com
కళ్యాణ్ రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో కళ్యాణ్ రామ్ జర్నలిస్ట్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది.మరో రెండు మూడు రోజుల్లో ఈ చిత్ర యూనిట్ స్పెయిన్ వెళ్లడానికి రెడీ అవుతుంది.
ఇదిలా ఉంటే....ఈ చిత్రానికి ఇజం, జర్నలిజమ్ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ చిత్రానికి రిపోర్టర్ బాలకృష్ణ అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టీజర్ & టైటిల్ ఎనౌన్స్ చేయనున్నారు. సో...ఈ మూవీ టైటిల్ ఇజమ్, జర్నలిజమ్, రిపోర్టర్ బాలకృష్ణ ఈ మూడింటిలో ఏమిటి అనేది కళ్యాణ్ రామ్ పుట్టినరోజైన రేపు తెలుస్తుంది. ఈ చిత్రాన్నిదసరా కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments