అల్లుశిరీష్ కొత్త టైటిల్...
Send us your feedback to audioarticles@vaarta.com
అల్లుశిరీష్ హీరోగా శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎం.వి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో ఎస్.శైలేంద్ర బాబు, కె.వి.శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి నిర్మాతలుగా ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. లవ్ ఎంటర్ టైనర్ తో పాటు 700 ఏళ్ల పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఈ సినిమాకు తాజాగా జగదేకవీరుని కథ అనే టైటిల్‌ను రిజిష్టర్ చేయించారట.
ఒకప్పుడు నందమూరి తారకరామారావు నటించిన జగదేకవీరుని కథ టైటిల్‌నే ఈ సినిమాకు పెట్టడం విశేషం. మరి రెండు షేడ్స్ లో అల్లు శిరీష్ ఎలా అలరిస్తాడో చూడాలి. అల్లుశిరీష్ ప్రస్తుతం నటించిన శ్రీరస్తు శుభమస్తు సినిమా ఆగస్ట్ 5న గ్రాండ్ రిలీజ్ కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments