తమిళనాడులో కొలువుదీరిన స్టాలిన్ సర్కార్..

తమిళనాడు ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ శుక్రవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. స్టాలిన్‌ చేత గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ ఈ ప్రమాణ స్వీకారం చేయించారు. కరోనా మహమ్మారి కారణంగా చాలా సింపుల్‌గా కార్యక్రమం జరిగిపోయింది. ముఖ్యమైన అతిథులను మాత్రమే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్‌ కూటమి ఘన విజయం సాధించింది. ఈ క్రమంలోనే శుక్రవారం స్టాలిన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే మంత్రి పదవులు లభించిన 34 మంది సైతం నిన్న ప్రమాణ స్వీకారం చేశారు.

కాగా.. తమిళనాడులో మొత్తం 234 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. డీఎంకే కూటమి 156 సీట్లను గెల్చుకుని ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేసుకుంది. అన్నాడీఎంకే కూటమికి 78 సీట్లు లభించాయి. దీంతో రాష్ట్రంలో దశాద్దకాలం తర్వాత డీఎంకే ప్రభుత్వం ఏర్పాటైంది. ఇదిలావుంటే.. బుధవారం కొత్తగా ఎన్నికైన డీఎంకే శాసనసభ్యుల సమావేశం ఆ పార్టీ ప్రధాన కార్యాలయమైన అన్నా అరివాయంలో జరిగింది. ఇందులో శాసనసభాపక్ష నేతగా ఎంకే స్టాలిన్‌ను ఎన్నుకున్నారు. ఆ తర్వాత స్టాలిన్ వెళ్లి రాష్ట్ర గవర్నరును రాజ్‌భవన్‌లో కలుసుకుని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు.

1. ఎంకే స్టాలిన్‌: ముఖ్యమంత్రి

2. దురైమురుగన్‌: జల వనరులు

3. కేఎన్‌ నెహ్రూ: పురపాలక కార్యకలాపాలు

4. ఐ. పెరియసామి: సహకార శాఖ

5. ఎన్. పొన్ముడి: ఉన్నత విద్య

6. ఈవీ వేలు: పబ్లిక్‌ వర్క్స్‌

7. ఎంఆర్‌కే పన్నీరు సెల్వం: వ్యవసాయం, రైతు సంక్షేమం

8. కేకేఎస్‌ఆర్‌ రామచంద్రన్‌: రెవెన్యూ, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌

9. తంగం థెన్నరసు: పరిశ్రమల శాఖ

10. ఎస్‌ రఘుపతి: న్యాయ శాఖ
11. ఎస్‌. ముత్తుసామి: గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి

12. కేఆర్‌ పెరియకరుప్పన్‌: గ్రామీణాభివృద్ధి శాఖ

13. టీఎం అంబారసన్‌: గ్రామీణ పరిశ్రమలు

14. ఎంపీ సామినాథన్‌: సమాచార, ప్రచార శాఖ

15. పి. గీతాజీవన్‌: సామాజిక సంక్షేమం, మహిళా సాధికారత

16. అనిత ఆర్‌ రాధాకృష్ణన్‌: మృత్స్యకార, జంతు పరిరక్షణ

17. ఎస్‌ఆర్‌ రాజకన్నప్పన్‌: రవాణా శాఖ

18. కే రామచంద్రన్‌: అటవీ శాఖ

19. ఆర్‌ చక్రపాణి: ఆహార, పౌర సరఫరా

20: వీ. సెంథిల్‌ బాలాజీ: విద్యుత్‌, ప్రొబిషన్‌, ఎక్సైజ్‌

21. ఆర్‌ గాంధీ: చేనేత, టెక్స్‌టైల్స్‌ శాఖ

22. ఎంఏ సుబ్రమణియన్‌: ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం

23. పి. మూర్తి: వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్‌

24. ఎస్‌ఎస్‌ శివశంకర్‌: బీసీ సంక్షేమం

25. పీకే శేఖర్‌బాబు: దేవాదాయ శాఖ

26. పళనివేల్‌ త్యాగరాజన్‌: ఆర్థిక, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌

27. ఎస్‌ఎమ్‌ నాజర్‌: పాలు, డెయిరీ డెవలప్‌మెంట్‌

28. జిగ్నీ కేఎస్‌ మస్తాన్‌: మైనారిటీ, ఎన్నారై సంక్షేమం

29. అన్బిల్‌ మహేశ్‌ పొయ్యమొళి: పాఠశాల విద్య

30. శివ వీ మెయ్యనాథన్‌: పర్యావరణ శాఖ

31. సీవీ గణేశన్‌: కార్మిక సంక్షేమం, నైపుణ్య శిక్షణ

32. టి మనో తంగరాజా: ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ

33. ఎం మతివెంతన్‌: పర్యాటక శాఖ

34. ఎన్‌కే సెల్వరాజ్‌: ఆది ద్రవిడ సంక్షేమం

More News

వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్‌ కిషన్ చిత్రం

తను నటించే ప్రతి సినిమాలోనూ ఓ కొత్తదనాన్ని చూపిస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తుంటారు యంగ్‌ వర్సెటైల్‌ హీరో సందీప్‌ కిషన్‌.

కేవీ గుహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఆనంద్ దేవ‌ర‌కొండ 'హైవే'

ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల‌కు సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేసిన కేవీ గుహ‌న్ `118`చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మారి మొద‌టి సినిమాతోనే సూప‌ర్‌హిట్ సాధించారు.

సోనూసూద్ టీం లేకుంటే ఆ 22 మంది ఏమైపోయేవారో..

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఫలితం ఎంత దారుణంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

సీఎంగా మమత ప్రమాణ స్వీకారం.. పదవిలో కొనసాగాలంటే..

టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ మూడోసారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

కరోనా విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు డెడ్‌లైన్..

తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణకు హాజరైన డీజీపీ మహేందర్ రెడ్డి, డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ హాజరయ్యారు.