ఓం నమో వేంకటేశాయ ఫస్ట్ లుక్ వచ్చేసింది..!
Send us your feedback to audioarticles@vaarta.com
నవరస సమ్రాట్ నాగార్జున - దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్లో రూపొందుతున్న మరో భక్తిరస చిత్రం ఓం నమో వేంకటేశాయ. ఈ చిత్రాన్ని శిరిడి సాయి చిత్ర నిర్మాత మహేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. వేంకటేశ్వరస్వామి భక్తుడు హధీరామ్ బాబా జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో వేంకటేశ్వరస్వామిగా సౌరభ్ నటిస్తుంటే...హధీరామ్ బాబాగా నాగార్జున నటిస్తున్నారు. అందాల తారలు అనుష్క, ప్రగ్యా జైస్వాల్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఇక ఈ భక్తిరస చిత్రం ఫస్ట్ లుక్ ను ఈరోజు ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసారు. ఇందులో వెంకటేశ్వరస్వామిగా సౌరభ్ గెటప్ విశేషంగా ఆకట్టుకునేలా ఉంది.శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం కోసం ఆగష్టు 10 నుంచి పూణె సమీపంలో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments