పాపం థర్టీ ఇయర్స్ పృథ్వీ... బన్నీ సినిమాలో పొగొట్టుకున్న పాత్ర ఇదే!!
- IndiaGlitz, [Thursday,January 23 2020]
సినిమాలకు..రాజకీయాలకు అవినాభావ సంబంధాలుంటాయనే విషయాన్ని ఎవరూ కాదనలేరనే సంగతి తెలిసిందే. అయితే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమా వాళ్లని విమర్శలు చేయకూడదు. ఎందుకంటే అటు ఇటైతే మళ్లీ వాళ్లు సినిమాల్లోకే రావాల్సి ఉంటుంది. తాజాగా పృథ్వీ పరిస్థితి అలాగే తయారైంది. థర్టీ ఇయర్స్ పృథ్వీ కెరీర్ సినిమాల్లో ఓ దశలో పీక్స్‌కు చేరుకుంది. బ్రహ్మానందం తర్వాత ఆ ప్లేస్ పృథ్వీదే అని అందరూ అనుకున్నారు. అయితే అదే సమయంలో ఆయన రాజకీయాల వైపు అడుగులేశారు. వేస్తే.. మంచిది కానీ.. విమర్శలు చేసే ముందు కూడా ఆలోచించుకుని మాట్లాడాలి. కానీ పృథ్వీ అలాంటివేం ఆలోచించుకోకుండా పవన్‌కల్యాణ్‌పై, జనసేనానిపై ఘాటు విమర్శలు చేశారు. ఇది ఆయన సినిమా కెరీర్‌పై గట్టిగానే ఎఫెక్ట్ పడింది. మెగా హీరోలెవరూ ఆయనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపలేదు.
ఉదాహరణకు బన్నీ హీరోగా త్రివిక్రమ్ తెరెక్కించిన 'అల వైకుంఠపురములో' సినిమాలో జయరాం బామర్ది పాత్రకు ముందుగా పృథ్వీనే అనుకున్నారట. అయితే ఎన్నికల సమయంలో పృథ్వీ చేసిన వ్యాఖ్యలు బన్నీని తీవ్రంగా భాధించడంతో ఆయన పృథ్వీ సినిమాలో వద్దని ఖరాఖండీగా చెప్పేశారట. దీంతో త్రివిక్రమ్ ఆ ప్లేస్‌లో హర్షవర్ధన్‌ను తీసుకున్నారట. అలా పృథ్వీ హిట్ సినిమాలో మంచి పాత్రను చేసే అవకాశాన్ని పోగొట్టుకున్నాడని అంటున్నారు.
ఇప్పుడు పృథ్వీ రాజకీయ పరిస్థితి కూడా తారుమారైంది. ఎస్‌వీబీసీ ఛైర్మన్‌గా ఉన్న ఆయన ఓ మహిళ మాట్లాడిన తీరు బయటకు పొక్కడంతో వివాదం రేగి ఆయన పోస్ట్ ఊస్ట్ అయ్యింది.