'ప్రేమ‌మ్' రిలీజ్ డేట్

  • IndiaGlitz, [Tuesday,July 19 2016]

అక్కినేని నాగచైతన్య హీరోగా చందుమొండేటి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ప్రేమమ్'. మలయాళ సినిమాకు రీమేక్ గా రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. కార్తికేయ ఫేం చందుమొండేటి ద‌ర్శ‌క‌త్వంలో సితార ఎంట‌ర్ టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌.నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా ఇందులో శృతిహాస‌న్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, మ‌డోన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్స్ గా న‌టిస్తున్నారు.

ఈ సినిమాను ముందుగా ఆగ‌స్ట్ 12న విడుద‌ల చేస్తార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే క‌బాలి పోస్ట్ పోన్ కావ‌డం, అలాగే జ‌న‌తాగ్యారేజ్ వంటి చిత్రాలు కూడా వెన‌క్కి వెళ్ల‌డం ద‌రిమిలా ఈ చిత్రాన్ని తాజా స‌మాచారం ప్ర‌కారం సెప్టెంబ‌ర్ 9న విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు భావిస్తున్నార‌ట‌. ఎప్పుడో వేస‌వికి రావాల్సిన చైతు సినిమా వాయిదాలు పడుతూ సెప్టెంబ‌ర్ రిలీజ్‌కు చేరింది.

More News

లుంగీ క‌ట్టిన ప‌వ‌న్ త‌న‌యుడు

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ మాజీ శ్రీమ‌తి రేణుదేశాయ్ ప‌వ‌న్ అభిమానుల‌కోసం ఓ పోటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇటీవ‌ల త‌న త‌న‌యుడు అకీరానంద్‌, త‌న‌య ఆద్య‌ల‌తో క‌లిసి రేణు మాల్దీవుల ట్రిప్‌కు వెళ్ళింది.

'క‌బాలి' లో ట్విస్ట్ అదేన‌ట‌...

సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ హీరోగా పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `క‌బాలి`. మ‌లేషియా బ్యాక్ డ్రాప్‌లో డాన్ క్యారెక్ట‌ర్‌లో ర‌జ‌నీకాంత్ జూలై 22న సంద‌డి చేయ‌డానికి రెడీ అవుతున్నాడు. ఇప్ప‌టికే సినిమాపై భారీ అంచ‌నాల‌తో అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

ద‌ర్శ‌క నిర్మాత‌తో డేటింగ్ లో శ్వేతా బ‌సు

`కొత్త బంగారులోకం`తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన న‌టి శ్వేతా బ‌సుప్ర‌సాద్ త‌ర్వాత ప‌లు తెలుగు చిత్రాల్లో న‌టించింది. కానీ అనుకున్నంత గుర్తింపు రాలేదు.

సాహ‌సం శ్వాస‌గా సాగిపో అంటూ చైతు వ‌చ్చేస్తున్నాడు..

అక్కినేని నాగ‌చైత‌న్య హీరోగా గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం సాహ‌సం శ్వాస‌గా సాగిపో. తెలుగు, త‌మిళ్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు స్టార్ రైట‌ర్ కోన వెంక‌ట్ అందిస్తున్నారు.

క‌బాలి లీక్ - న‌ష్టం ఏమీ ఉండ‌దంటున్న సెన్సార్ చీఫ్..

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన సంచ‌ల‌న చిత్రం క‌బాలి. ఈ చిత్రం ఈనెల 22న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఇదిలా ఉంటే...ఉడ్తా పంజాబ్, సుల్తాన్, గ్రేట్ గ్రాండ్ మ‌స్తీ చిత్రాల వ‌లే...క‌బాలి చిత్రం కూడా లీకైన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది.