ప్ర‌భాస్ న్యూమూవీ టైటిల్ ఇదా..

  • IndiaGlitz, [Friday,July 08 2016]

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ తో మిర్చి చిత్రాన్ని నిర్మించిన యు.వి. క్రియేష‌న్స్ సంస్థ ప్ర‌భాస్ తో రెండు చిత్రాల‌ను నిర్మించ‌డానికి ప్లాన్ చేస్తుంది. ఇందులో ఒక చిత్రానికి ర‌న్ రాజా ర‌న్ డైరెక్ట‌ర్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. దాదాపు 80 కోట్ల బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించ‌నున్న‌ట్టు స‌మాచారం.

బాహుబ‌లి 2 షూటింగ్ పూర్త‌యిన త‌ర్వాత న‌వంబ‌ర్ లో ఈ చిత్రం ప్రారంభించి...డిసెంబ‌ర్ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే....యు.వి. క్రియేష‌న్స్ సంస్థ ఫిల్మ్ ఛాంబ‌ర్ లో రాథ ప్రేమ‌క‌థ అనే టైటిల్ రిజిష్ట‌ర్ చేయించారు. టైటిల్ ను బ‌ట్టి ఇది లేడీ ఓరియంటెడ్ మూవీ అని తెలుస్తుంది. అందుచేత‌... ప్ర‌భాస్ తో ర‌న్ రాజా ర‌న్ డైరెక్ట‌ర్ సుజిత్ చేసే చిత్రం కోసం కాదు ఈ టైటిల్ అనిపిస్తుంది. మ‌రి...రాథ ప్రేమ‌క‌థ చిత్రంలో ఎవ‌రు న‌టిస్తారో..ఎవ‌రు డైరెక్ట్ చేస్తారో తెలియాల్సి వుంది.

More News

ఫిల్మ్ ఛాంబ‌ర్ వ‌ద్ద నిరాహార దీక్ష చేస్తున్న హీరో..

హైద‌రాబాద్ ఫిల్మ్ ఛాంబ‌ర్ వ‌ద్ద నిరాహార దీక్ష చేస్తున్న హీరో ఎవ‌రునుకుంటున్నారా..?  లాహిరి లాహిరి లాహిరిలో..., ధ‌న‌ల‌క్ష్మి ఐ ల‌వ్ యు త‌దిత‌ర చిత్రాల్లో న‌టించిన ఆదిత్యా ఓం.

నిఖిల్ మూవీతో క‌న్న‌డ‌లో ఎంట్రీ ఇస్తున్న ఆది..

డైలాగ్ కింగ్ సాయికుమార్ త‌న‌యుడు ఆది ప్రేమ‌కావాలి సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి తొలి చిత్రంతోనే యూత్ లో మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్నారు.

ఫ‌స్ట్‌డే 1.26 కొట్ల గ్రాస్ వసూలుచేసిన‌ రష్మి గౌత‌మ్‌ 'అంతం'

'గుంటూరు టాకీస్ త‌రువాత  రంజాన్ ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా ర‌ష్మిగౌతమ్ హీరోయిన్ గా విడుద‌ల‌యిన చిత్రం 'అంతం'. ద‌ర్శ‌క‌ నిర్మాత జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్ అతిత‌క్కువ‌ బ‌డ్జెట్ లో స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కించారు.

సురేష్ బాబు చేతుల మీదుగా పెళ్ళి చూపులు ఆడియో విడుదల

విజయ్ దేవరకొండ, రీతూ వర్మ జంటగా తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం పెళ్లి చూపులు. ధర్మపథ క్రియేషన్స్‌, బిగ్‌ బెన్‌ స్టూడియోస్‌, వినూత్న‌ గీత బ్యానర్స్ పై రాజ్ కందుకూరి, యస్ రాగినేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

గోవుల మ‌ధ్య గోపాలుడు...

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి ప్ర‌కృతి అన్నా, ప‌శువులు అన్నా ఎంతో ఇష్టం. అందుకే స‌మ‌యం దొరికితే చాలు...త‌న ఫామ్ హౌస్ లో ప్ర‌కృతి, ప‌శువుల మ‌ధ్య ఎక్కువ గ‌డ‌ప‌డానికి ఇష్ట‌ప‌డుతుంటాడు.