ఆమె ప్రసవం.. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం..

  • IndiaGlitz, [Wednesday,October 14 2020]

ఒక మహిళ ప్రసవం ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఓ అనూహ్య పరిస్థితుల్లో కొన్ని వేల అడుగుల ఎత్తులో జరగడమే ఇందుకు కారణం. ఈ నెల ఏడో తేదీన ఢిల్లీ నుంచి బెంగుళూరుకు వెళుతున్న విమానంలో ఓ మహిళ ప్రసవం జరిగింది. దీనికి సంబంధించిన విశేషాలను డాక్టర్ శైలజ ఓ మీడియా సంస్థతో పంచుకున్నారు. ఢిల్లీ నుంచి బెంగుళూరు విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ప్రయాణికుల్లో కంగారు ప్రారంభమైంది. మోనిక అనే గర్భిణి ప్రసవ వేదన ఫ్లైట్‌లోని వారందరినీ కంగారు పెట్టించింది. ఆ ఫ్లైట్‌లో డాక్టర్ శైలజ కూడా ప్రయాణిస్తున్నారు. క్రూ లేడీ డాక్టర్ ఎవరైనా ఉన్నారా? అని అడగడంతో శైలజ వెళ్లి పరీక్షించారు. తొలుత అబార్షన్ అవుతుందని ఆమె భావించారు. అయినా ఎందుకైనా మంచిదని తన ప్రయత్నం తాను మొదలు పెట్టారు.

ప్రసవం చేసి బిడ్డను చేతుల్లోకి తీసుకున్న డాక్టర్ శైలజ..

ముందుగా మోనికను టాయిలెట్‌కు తీసుకెళ్లమని డాక్టర్ శైలజ సూచించారు. ఆమె గైనకాలజిస్ట్ కావడంతో ప్రసవం చేయడం పెద్ద కష్టమైన పని కాదు.. కానీ ఫ్లైట్‌లో ఎలాంటి సౌకర్యాలు ఉండవు. పైగా సహజ వాతావరణానికి భిన్నమైన వాతావరణంలో ప్రసవం అంటే చాలా కష్టం కూడుకున్న పని. కానీ ఆమె ధైర్యంగా సక్సెస్‌ఫుల్‌గా ఓ బిడ్డకు ప్రాణం పోశారు. క్రూ మోనికాను టాయిలెట్‌కు తీసుకెళ్లగానే అక్కడ రక్తపు మరకలు కనిపించడంతో డాక్టర్ శైలజకు క్షణ కాలంపాటు ఏమీ అర్థం కాలేదట. వెంటనే టాయిలెట్‌కు చేరుకున్నారు. అప్పటికే మోనికకు ప్రసవం ప్రారంభమైంది. బిడ్డ తల కూడా బయటకు వచ్చేస్తోంది. క్షణాల్లో ప్రసవం చేసి బిడ్డను చేతుల్లోకి తీసుకున్న శైలజకు ఇంకా బిడ్డ పూర్తిగా ఎదగలేదని అర్థమైంది. కానీ తల్లీబిడ్డ క్షేమంగా ఉండటంతో ఊపిరి పీల్చుకున్నారు. బిడ్డ పుట్టాడని తెలియడంతో ప్రయాణికులు కూడా హర్షం వ్యక్తం చేశారు. చప్పట్లతో శైలజను అభినందించారు.

శరీర ఉష్టోగ్రతలను అదుపులోకి తీసుకురావడమే పెను సవాల్..

అయితే సమస్య అంతటితో పూర్తి కాలేదు. పసికందు బొడ్డుతాడు కోసి ముడివేయాలి. కానీ విమానంతో కత్తెరలు, క్లాంపులు ఉండవు. కానీ తప్పనిసరిగా బొడ్డుతాడు కోయాలి. అందుబాటులో ఉన్న కత్తెరను శానిటైజ్ చేసి బొడ్డుతాడును కత్తిరించి ముడి వేశారు. ప్రసవం అయిన తరువాత విపరీతంగా బ్లీడింగ్ అవుతుంది. కానీ ఫ్లైట్‌లో అవసరమైన పరికరాలు లేవు. చేతితోనే మోనిక కడుపును మసాజ్ చేసి అనంతరం తీసుకొచ్చి ఫ్లైట్‌లో ఓ సీటుపై బ్యాగులతో ఓ బెడ్ అరేంజ్ చేసి పడుకోబెట్టారు. ప్రయాణికులు సైతం తమ వద్ద ఉన్న శాలువాలు, శానిటరీ ప్యాడులు ఇచ్చారు. కానీ రక్తస్రావాన్ని ఆపడం పెద్ద సవాల్. దానికి ఓ ఇంజెక్షన్ ఇవ్వాలి. అదృష్టవశాత్తు ఫ్లైట్‌లో రక్తస్రావాన్ని ఆపే ఇంజెక్షన్ల సెట్‌లు సైతం దొరికాయి. వెంటనే మోనికకు శైలజ ఆ ఇంజక్షన్ చేయడంతో రక్తస్రావం అదుపులోకి వచ్చింది. ఇక శరీర ఉష్టోగ్రతలను అదుపులోకి తీసుకురావడం కూడా పెను సవాలే. దీనికి శైలజ ‘కంగారు పద్ధతి’ని ఉపయోగించారు. దీని కోసం.. బిడ్డను తల్లి ఛాతి మీద పడుక్కోబెట్టి గుడ్డలు చుట్టాలి. అలా చేస్తే అది బిడ్డకు సహజసిద్ధమైన ఇంక్యుబేటర్‌లా తోడ్పడుతుంది. బిడ్డ శరీర ఉష్ణోగ్రత నిలకడగా ఉంచడం కోసం శైలజ ఈ పద్ధతిని ఉపయోగించారు.

ఏడేళ్ల విరామం తరువాత తొలి డెలివరీ..

విమానం దిగిన వెంటనే ఎయిర్‌పోర్టు సిబ్బంది డాక్టర్ శైలజకు ఘన స్వాగతం పలికారు. దీంతో అప్పటి దాకా పడిన కష్టమంతా తాను మర్చిపోయానని శైలజ ఓ మీడియా సంస్థకు వెల్లడించారు. జాతీయ మీడియా సైతం ఈ వార్తను కవర్ చేసింది. డాక్టర్ శైలజ ఏడేళ్ల విరామం తర్వాత చేసిన తొలి డెలివరీ అట ఇది. గైనకాలజిస్టే అయినప్పటికీ ఫీటల్‌ మెడిసిన్‌ నిపుణురాలిగా కొనసాగుతుండటంతో గత ఏడేళ్లుగా ఆమెకు ప్రసవాలు చేసే అవసరం రాలేదట. అయినా పూర్వానుభవం ఉపయోగపడిందని శైలజ తెలిపారు. డాక్టర్ శైలజ వైజాగ్‌లో పుట్టారు. ఎంబీబీఎస్‌ తర్వాత పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కోలార్‌లో చేశారు. ఆ తర్వాత చెన్నైలో ఫీటల్‌ మెడిసిన్‌లో స్పెషలైజేష్‌ చేశారు. శైలజ భర్త ఉదయ్‌భాస్కర్‌ కూడా డాక్టరే కావడం విశేషం.

More News

ప్ర‌భాస్ చిత్రంతో అమితాబ్ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా..?

ప్యాన్‌ ఇండియా స్టార్‌ పభాస్‌ 21వ సినిమా ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై అశ్వినీదత్‌ నిర్మాతగా 'మహానటి' ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో

నితిన్ గ్యాప్ తీసుకోవ‌డం లేదా..?

కోవిడ్ టైమ్‌లో కొత్త పెళ్లికొడుకుగా మారిన నితిన్ ప్ర‌స్తుతం ‘రంగ్ దే’ సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు.

హైదరాబాద్ అస్తవ్యస్తం.. 100 ఏళ్లలో ఇదే తొలిసారి..

భారీ వర్షాలతో హైదరాబాద్ అస్తవ్యస్తమైంది. భారీ వృక్షాలు సైతం నేలకొరగాయి. విద్యుత్, టెలిఫోన్, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది.

త‌మిళ ద‌ర్శ‌కుడితో చ‌ర‌ణ్‌..!

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా ‘ఆర్ఆర్ఆర్ (రౌద్రం ర‌ణం రుధిరం‌)’లో

ఆత్మాహుతి దాడి చేస్తాననుకుని అరెస్ట్ చేశారు: సత్యదేవ్

లాక్‌‌‌డౌన్ స్టార్‌గా పేరు పొందారు సత్యదేవ్. లాక్‌డౌన్ సమయంలో ఆయన సినిమాలు ఓటీటీలో విడుదలై మంచి విజయం సాధించాయి.