డిగ్రీ అర్హత పరీక్ష రాసిన నటి హేమ..
Send us your feedback to audioarticles@vaarta.com
సినీ నటి హేమ ఓపెన్ డిగ్రీ పరీక్షలకు హాజరయ్యారు. చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీకి వచ్చిన హేమ.. ఏ కారణాల వల్లనో చదువును మధ్యలోనే ఆపేసింది. ఇన్నాళ్లకు ఆమె తిరిగి చదువుపై ఆసక్తిని కనబరచడం విశేషం. దీంతో నేడు నల్లగొండలోని ఎన్జీ కళాశాల పరీక్షా కేంద్రంలో బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అర్హత పరీక్ష రాసింది. డిసెంబర్ 2018లో జరిగిన ‘మా’ డైరీ లాంచింగ్ కార్యక్రమానికి హేమ యాంకర్‌గా బాధ్యతలు నిర్వర్తించింది. ఈ సమయంలో హేమ తెలుగు చదవడానికి ఆపసోపాలు పడింది. సూపర్ స్టార్ కృష్ణకు సంబంధించిన స్క్రిప్ట్ చదివేందుకు తెగ ఇబ్బంది పడింది. ఈ సమయంలో ఆమెపై విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి.
ఓపెన్ డిగ్రీ పరీక్షకు హాజరవడంపై హేమ మాట్లాడుతూ.. ఎప్పటినుంచో డిగ్రీ చేయాలని ఉందని... హైదరాబాద్ అయితే ఇబ్బంది ఉంటుందని నల్లగొండకు వచ్చి పరీక్ష రాశానని తెలిపింది. ఎవరి కంట పడకూడదని అనుకున్నందునే ఇక్కడ పరీక్ష రాసేందుకు వచ్చానని తెలిపింది. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్‌లో పాల్గొంటున్నానని.. నల్లగొండ అయితే ఫిల్మ్ సిటీకి దగ్గరగా ఉంటుందని అక్కడ పరీక్ష రాస్తున్నట్టు వెల్లడించింది. అంతే కాకుండా నల్లగొండ ప్రాంతంలో తమకు బంధువులు కూడా ఉన్నారని.. అందుకే అక్కడ డిగ్రీ అర్హత పరీక్ష రాశానని హేమ తెలిపింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments