'మా' ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా హేమ విజయం

  • IndiaGlitz, [Monday,March 11 2019]

‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌) ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్‌‌గా నటి హేమ విజయం సాధించారు. మా అధ్యక్షుడిగా సీనియర్ నటుడు నరేశ్ గెలుపొందగా.. వైస్ ప్రెసిడెంట్‌గా హేమ గెలుపొందారు. ముందు నుందే కచ్చితంగా మహిళలంతా తనకు మద్దతిస్తారని.. గెలుస్తానని ఆమె గట్టి ధీమాతోనే ఉన్నారు. అనుకున్నట్లుగానే ఎన్నికల బరిలో నిలిచి గెలిచి సత్తాచాటారని చెప్పుకోవచ్చు.

కాగా.. గత ఎన్నికల్లో గెలిచిన శివాజీ రాజా ప్యానల్‌లో ఈసీ మెంబర్‌గా గెలిచి హేమ యాక్టివ్‌గా ఉన్నారు. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధినిగా పోటీ చేసి గెలిచారు. ఇదిలా ఉంటే గత ఎన్నికల్లో శివాజీ రాజా ప్యానల్‌లో గెలిచినప్పటికీ ఆ ప్యానల్‌లో సరైన గుర్తింపు ఇవ్వకపోవడంతో పాటు ఈ ఎన్నికల్లో కూడా ఈసీ మెంబర్‌గానే పోటీకి అవకాశం ఉండటంతో ఉపాధ్యక్షపదవిపై కన్నేసిన హేమ స్వతంత్ర అభ్యర్ధిగా అదృష్టాన్ని పరీక్షించుకుని ఇండస్ట్రీలోని మహిళల సపోర్ట్‌తో గెలిచారు.

ముందు నుంచే.. ఒక వైపు ‘జీవిత’ తన ప్రత్యర్ధి శివాజీ రాజా ప్యానల్‌పై విమర్శలు గుప్పిస్తూ.. అందులో మహిళలకు ప్రాధాన్యత లేదని ఆరోపించారు. వీటికి బలాన్నిస్తూ నిజంగానే ఆ ప్యానల్‌లో మహిళలకు ప్రాధాన్యత లేదని... అందుకే ఇండిపెండెంట్‌గా పోటీ చేసి సత్తా చాటుతానని చెప్పిన హేమ అనుకున్నట్లుగానే గెలుపొందారు.