బిగ్‌బాస్ 3 షోపై హేమ షాకింగ్ కామెంట్స్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ 3 షో విజయవంతంగా నడుస్తున్న విషయం విదితమే. ఇప్పటి వారం రోజులు పాటు సాఫీగా సాగడంతో పాటు తొలి ఎలిమినేషన్ జరిగింది. అయితే షో నుంచి ఎలిమినేట్ అయిన నటి హేమ పలు చానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈమె చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి. వాస్తవానికి ఈమె ఎలిమినేట్ అయిన తర్వాత షో అంతా బాగుందని కితాబిచ్చి.. ఇప్పుడు బయటికొచ్చాక మాట మార్చి మాట్లాడటం గమనార్హం. హౌస్‌లో ఆశించినంతగా రాణించలేకపోవడం.. పదేపదే కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా నిలుస్తుండగా బిగ్‌బాస్-3 నుంచి హేమను బయటికి పంపించేశారు. అయితే హేమ మాత్రం మరోలా మాట్లాడుతున్నారు.
హేమ షాకింగ్ కామెంట్స్ ఇవీ..!
"హౌస్ నుంచి నన్ను కావాలనే బయటికి పంపారు. ఈ షోలో ఉన్నది ఉన్నట్లుగా చూపించడంలేదు. లోపల ఒకటి జరిగితే బయట ఒకటి ప్రసారం చేశారు. వంటగది వల్లే గొడవలు వచ్చాయి. అది తప్ప నాపై ఎలాంటి ఫిర్యాదులు లేవు. ఓ మదర్ ఫీలింగ్‌తో ఉన్నాను.. అయితే ఎక్కువ పెట్టుకోవద్దు.. అది తీయోద్దు ఇది తీయోద్దు అని అనడంతో అది డామినేట్ చేయడం, కమాండింగ్‌లా అందరికీ అనిపించింది. అందుకే అందరూ నన్ను బ్యాడ్‌గా భావించారు. బిగ్ బాస్‌లో ఉన్నది ఉన్నట్టుగా చూపించట్లేదు. నాపై ముందు నుంచే నిర్లక్ష్యంగా వ్యవహరించారు" అని హేమ చెప్పుకొచ్చారు.
పక్కా ప్లాన్‌తో బయటికి పంపారు!!
"మొదటి రోజు నాకు సంబంధించిన ఆడియో-వీడియో క్లిప్ కూడా వేయలేదు. లోపల జరిగిన గొడవ వేరే.. నేనే సర్దిచెప్పాను... కానీ నేనే గొడవపడ్డట్టు ప్రసారం చేశారు. నాకు గూగుల్‌లో ఎక్కువ ఓట్స్ వచ్చాయి. కానీ హాట్‌స్టార్‌లో మాత్రమే ఓట్ వేయాలని క్లియర్‌గా చెప్పలేదు. నన్ను ప్రమోట్ చేసేలా ప్రోమో వేస్తామన్నారు.. కనీసం అది కూడా ప్లే చేయలేదు. ఈ విషయాలతో పాటు నా సందేహాలన్నీ ‘మా’ టీవీ వాళ్ళు క్లియర్ చేయమని కోరాను. నన్ను అక్క.. అక్కా అంటూనే... నాపై లేనిపోని మాటలు చెప్పారు. ప్లాన్డ్గా నన్ను బయటకు పంపేలా చేశారు" అని హేమ చెప్పుకొచ్చారు. కాగా.. హేమ స్థానంలో వైల్డ్ కార్డ్ ద్వారా ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి ఎంట్రీ ఇచ్చిన విషయం విదితమే. ఇదిలా ఉంటే.. హేమ షాకింగ్ కామెంట్స్‌పై ‘మా’ యాజమాన్యం, అక్కినేని నాగార్జున ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments