జనసేనలో ఎందుకు చేరాలి.. హేమ షాకింగ్ కామెంట్స్!
- IndiaGlitz, [Wednesday,January 30 2019]
టైటిల్ చూడగానే.. ఇదేంటి ఈ మాటలు అన్నది నిజంగానే సినీ నటి హేమేనా..? అయినా హేమ-పవన్ కల్యాణ్ మధ్య ఎలాంటి గొడవల్లేవ్గా..? ఈ రేంజ్లో ఆమె ఊగిపోవడానికి కారణాలేంటి..? అని ఆలోచిస్తున్నారు.. అవును మీరు వింటున్నది నిజమే. అసలెందుకు ఈమె ఇలా మాట్లాడారు..? అసలు కహానీ ఏంటో ఇప్పుడు చూద్దాం.
టాలీవుడ్ నటి హేమ గురించి సినీ ప్రియులకు కొత్తగా చెప్పనక్కర్లేదు. ఆమె ఎంత సాఫ్ట్‌గా ఉన్న కోపమొస్తే మాత్రం చాలా హార్డ్.! ఆమెను రెచ్చగొడితే ఎదుటోళ్ల పరిస్థితి అంతే మరి. ఈమె దగ్గర ఎక్స్‌ట్రాలు చేస్తే చెప్పుతో కొట్టినట్లుగా బుద్ధి చెబుతూ ఉంటుంది. ఇదంతా రీల్ లైఫ్‌లో కాదండోయ్.. రియల్ లైఫ్‌లోనే. హేమకు సినిమాలంటే ఎంత ప్రాణమో రాజకీయాలన్నా కూడా అంతకు డబుల్ ఇష్టం మరి. గత ఎన్నికల్లో పోటీదాకా వచ్చి కనుమరుగైన హేమ మరోసారి పొలిటికల్ వ్యవహారంలో తలదూర్చి నెట్టింట్లో హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ‘ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య 14వ రాష్ట్ర మహాసభలు’ జరిగాయి. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి విచ్చేసిన హేమ తీవ్ర దుమారం రేపే వ్యాఖ్యలు చేసింది.
జనసేనలోనే ఎందుకు చేరాలి..!?
సమావేశం అనంతరం ఒకరిద్దరు మీడియా ప్రతినిధులు రాజకీయాల గురించి హేమను ప్రశ్నించారు. ఇంకో ప్రతినిధి అయితే ఏకంగా మీరు జనసేనలోకి వెళ్తున్నారా..? అని ప్రశ్నించారు. దీంతో హేమకు కోపం కట్టలు తెంచుకుంది. అప్పటికే ఫ్రస్టేషన్‌తో ఉన్న హేమ.. జనసేనలోనే ఎందుకు చేరాలి?. పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి అయినా అది వేరు.. ఇది వేరు. త్వరలో మహిళలకు ప్రాధాన్యమిచ్చే పార్టీలోనే చేరతా. టికెట్ వస్తే కచ్చితంగా పోటీ చేస్తా. లేకుంటే నటిగా కొనసాగుతాను అని హేమ సెలవిచ్చారు.
మొగుళ్లపై హాట్ హాట్ కామెంట్స్..
తొలి రోజు మహాసభల్లో భాగంగా ఏలూరులోని కార్పొరేషన్ కార్యాలయం ఆవరణలో బహిరంగసభ జరిగింది. ఈ సభలో హేమ మాట్లాడుతూ.. ఇంట్లో మొగుళ్లను ఉతకడం ద్వారానే మహిళల పట్ల మార్పు మొదలవ్వాలని హాట్ కామెంట్స్ చేశారు. అయితే హేమ ఇంత మాటన్నా కనీసం సభావేదికపై ఉన్న మగవారి గానీ.. సభకు వచ్చిన జనాలుగానీ ఒక్కరంటే ఒక్కరు కూడా రియాక్టవ్వకపోవడం గమనార్హం.
మొత్తానికి చూస్తే రాజకీయాల్లోకి రావాలని హేమ మనసులో ఉన్న సరైన ఫ్లాట్ ఫాం లేకపోవడంతో.. ఏ పార్టీలోకి వెళ్తే తనకు మేలు జరుగుతుంది..? ఎక్కడైతే తనకు సముచిత స్థానం కల్పిస్తారనే విషయాలన్నింటినీ బేరీజు చేసుకొని హేమ బరిలోకి దిగాలని యోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఇలా ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న టైమ్‌లో అనవసరం నోరు జారుతూ నలుగురిలో నవ్వుల పాలవుతుండటం గమనార్హం. అయితే హేమ తాజా వ్యాఖ్యలపై మెగాభిమానులు, పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు, పవన్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాల్సిందే.