బిగ్‌బాస్ హౌస్ నుంచి హేమ ఔట్..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్-3 రోజురోజుకు అంచనాలు పెంచేసి.. ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. మరీ ముఖ్యంగా శని, ఆదివారాల్లో కింగ్ నాగార్జున రావడంతో షో మరింత రక్తికడుతోంది. మొదటి ఎపిసోడ్ నుంచి నేటి వరకూ అందరూ కంటెస్టెంట్ల వీర లెవల్లో రెచ్చిపోయి.. హౌస్‌లో నటించేశారు. వీటిలో కొన్ని వివాదాలకు దారితీయడం.. క్షమాపణలు చెప్పుకోవడం ఇవన్నీ జరిగిపోయాయి. అయితే మొదటి వారంలో హౌస్‌లో శివగామి ఉన్న సీనియర్ నటి కమ్ కమెడియన్ హేమ ఔటయ్యారు. మొదటి ఎలిమినేషన్ హేమే కావడం గమనార్హం.
ఇద్దరు సేఫ్!
ఇదిలా ఉంటే.. మొదటి వారంలో మొత్తం ఆరుగురు హేమ, జాఫర్, హిమజ, పునర్నవి, వితిక, రాహుల్ సిప్లిగంజ్ ఎలిమినేషన్‌లో ఉన్నారు. అయితే ఈ ఆరుగురిలో హేమ ఎలిమినేట్ అయ్యారు. వాస్తవానికి హేమ మొదటి రోజు నుంచే అందర్నీ కలుపుకుని మంచిగా.. హౌస్‌లో పెద్దకగా ఉంటూ వచ్చారు. ఇదే కంటిన్యూ చేస్తే హేమ ఎక్కడికో వెళ్తారని అందరూ భావించారు. సరిగ్గా మొదటి వారం తిరగకముందే హౌస్ నుంచి బయటొచ్చిపడ్డారు.
ఎవరి పరిస్థితేంటి..!?
మరోవైపు.. హేమ ఎలిమినేట్‌తో మిగతా ఐదుగురు కంటెస్టెంట్లు ఓటింగ్‌తో సేఫ్ జోన్‌లో పడ్డారని చెప్పుకోవచ్చు. అంతేకాదు నాగ్ స్వయంగా హిమజ, పునర్నవిలను సేఫ్‌జోన్‌లో పడేయడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఈ సందర్భంగా హేమను నాగార్జున కొన్ని ప్రశ్నలు అడిగారు. ఈ ప్రశ్నలకు హేమ కాసింత లాజిక్‌గా బదులిచ్చారు. ‘మహేష్.. మనసుకు మంచోడని మాటలు మాట్లాడేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. శ్రీముఖి, హిమజలకు ఆల్‌ది బెస్ట్. నా స్వీట్ హార్ట్ అషూ రెడ్డిని మాత్రం స్వార్థంగా ఉంచాను. అలీ బాగా ఆడుతున్నారని.. కొంచెం కోపం తగ్గించుకోవాలి. రాహుల్‌కు.. వితికా, వరుణ్‌లు హౌస్‌లో ఉండాలని అందరూ కోరుకున్నారు. పునర్నవి బేష్.. రవికృష్ణ మంచోడు. రోహిణి అందరితో కలిసిపోతుంది" అని చెబుతూ చివర్లో బాధ్యతలను బాబా భాస్కర్‌కు అప్పగించి హేమ బయటికొచ్చేశారు.
ఎన్ని ఓట్లు పడ్డాయ్..!
ఇదిలా ఉంటే.. కోటి ముప్పై లక్షల ఓట్లు హేమకు వచ్చాయని.. ఇంట్లోని మెజార్టీ సభ్యులు హేమను బ్యాడ్ పర్సన్‌గా ఎంచుకున్నారని.. బయట ప్రజల ఓటింగ్ కూడా అలాగే ఉందని హేమ ఎలిమినేట్ అయినట్లు నాగ్ ప్రకటించడంతో ఆమె ఒకింత ఆవేదనతో బయటికొచ్చారు. ఇక ఈ ఫస్ట్ ఎలిమినేట్ బిగ్‌బాస్ గురించి ఇంటర్వ్యూల్లో ఎలాంటి విషయాలు బయటపెడతారో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments