close
Choose your channels

నాపై ఒత్తిడి చేస్తున్నారు.. విష్ణు, ప్రకాష్ రాజ్, జీవితపై నటి హేమ పోటీ!

Thursday, June 24, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నాపై ఒత్తిడి చేస్తున్నారు.. విష్ణు, ప్రకాష్ రాజ్, జీవితపై నటి హేమ పోటీ!

'మా' అసోసియేషన్ ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. అయినప్పటికీ ముందుగానే ఎన్నికల హీట్ టాలీవుడ్ లో మొదలైపోయింది. ఈసారి మా అధ్యక్ష పదవి ఎన్నిక ఉత్కంఠగా మారుతోంది. మొదటగా తాను మా అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగుతున్నాను అంటూ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ప్రకటించారు.

ఆ తర్వాత విష్ణు, జీవిత రాజశేఖర్ కూడా బరిలోకి దిగారు. దీనితో మా ఎన్నికల్లో ఈసారి త్రిముఖ పోటీ అని అంతా భావించారు. ఊహించని విధంగా సీనియర్ నటి హేమ తాను కూడా పోటీలోకి దిగుతున్నట్లు ప్రకటించడం ఆసక్తిగా మారింది.

'మా'లో కార్యవర్గ సభ్యురాలిగా, ఉపాధ్యక్షురాలిగా పనిచేసిన అనుభవం ఉంది. ఈసారి ట్రెజరర్ పదవికి పోటీ చేయాలని అనుకున్నా. కానీ నువ్వెందుకు అధ్యక్ష పదవికి పోటీ చేయకూడదు అని నా వాళ్లంతా ఒత్తిడి చేస్తున్నారు. అందుకే ఆలోచన మార్చుకుని అధ్యక్ష పదవి కోసం పోటీలో నిలవాలని నిర్ణయించుకున్నట్లు హేమ తెలిపారు.

హేమ ప్రకటనతో మా ఎన్నికల్లో చతుర్ముఖ పోటీ నెలకొంది. అయితే ప్రకాష్ రాజ్, విష్ణు మధ్యే బలమైన పోటీ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అంటూ విమర్శలు వస్తున్నప్పటికీ తెరవెనున అతడికి మద్దతు తెలిపే వర్గం ఉందంటూ వార్తలు వస్తున్నాయి.

ఇక విష్ణు టాలీవుడ్ లో సీనియర్స్ అందరి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నాడు.ప్రకాష్ రాజ్ కు మెగా బ్రదర్ నాగబాబు ఇప్పటికే మద్దతు ప్రకటించారు. మా ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఒకరిపై మరొకరి విమర్శలు తీవ్ర రూపం దాల్చడం ప్రతిసారీ చూస్తూనే ఉన్నాం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment