Karate Kalyani:డ్రగ్స్‌ టెస్టులో హేమకు పాజిటివ్.. సినీ నటి కరాటే కల్యాణి తీవ్ర ఆగ్రహం

  • IndiaGlitz, [Thursday,May 23 2024]

తెలుగు న‌టి హేమ బెంగుళూరు రేవ్‌ పార్టీలో పట్టుబడిన విషయం తెలిసిందే. ఎలక్ట్రానిక్ సిటీ జీఆర్ ఫామ్‌హౌస్‌లో జరిగిన ఈ రేవ్‌ పార్టీకి హేమతో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. అయితే ఈ పార్టీలో ఉన్న‌ది తాను కాద‌ని.. త‌న‌కు ఆ పార్టీకి ఎటువంటి సంబంధం లేదంటూ హేమ‌ వీడియో విడుద‌ల చేసింది. అయితే ఆమె వీడియో వైర‌ల్ అయ్యాకే పార్టీలో ఉన్నది హేమ‌ అని గుర్తించామ‌ని బెంగుళూరు కమిషనర్‌ అధికారికంగా ప్రకటించారు. ఈ పార్టీకి వ‌చ్చిన హేమ త‌న అస‌లు పేరును కృష్ణ‌వేణిగా న‌మోదు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. తాజాగా నిర్వహించిన డ్రగ్స్ టెస్టులో హేమకు పాజిటివ్ వచ్చిందని కూడా పేర్కొన్నారు.

దీంతో ఈ ఘ‌ట‌న‌పై టాలీవుడ్ న‌టి కరాటే కళ్యాణి స్పందించింది. కరాటే కళ్యాణికి, హేమాకు మొద‌టి నుంచి గొడ‌వ ఉన్న విష‌యం విధితమే. మూవీ ఆర్టిస్ట్ ఎన్నికల్లో ఎదురెదురు నిలబడి ఒకరిని ఒక‌రు తిట్టుకున్నారు. ఆ త‌ర్వాత కళ్యాణి పేకాట ఆడుతుందంటూ హేమ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. దీంతో వీరిద్దరి మధ్య వివాదం ముదురుతూ వచ్చింది. తాజాగా రేవ్ పార్టీలో హేమ ప‌ట్టుబ‌డ‌టంపై కరాటే కళ్యాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. హేమ లాంటి వారు తీవ్రవాదుల కన్నా ప్ర‌మాదం, నేను అప్పట్లో పేకాట ఆడుతూ దొరికానంటూ హేమ నన్ను బజారుకీడ్చింది. ఇప్పుడు ఈమె రేవ్ పార్టీలో డ్రగ్స్‌తో దొరికింది. ఇది నిజం అని నిర్ధారణ అయ్యాక పోలీసులు ఆమెకు శిక్ష వేస్తారు. మా అసోషియేషన్ తరపున కూడా ఆమె పైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాము అని క‌ళ్యాణి వెల్ల‌డించింది.

మ‌రోవైపు రేవ్‌ పార్టీ కేసులో పోలీసుల విచార‌ణలో భాగంగా హేమకి డ్రగ్స్ టెస్ట్ నిర్వ‌హించ‌గా.. ఈ పార్టీలో హేమ డ్రగ్స్ తీసుకున్న‌ట్లు నిర్ధారణ అయ్యింది. డ్రగ్స్ టెస్ట్‌లో హేమకి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. హేమ‌తో పాటు డ్రగ్స్ టెస్ట్‌లో మొత్తం 86 మందికి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు ప్ర‌క‌టించారు. హేమను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశముందని సమాచారం. పాజిటివ్ వచ్చిన వారందరికీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. తమ ముందు హాజరై దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా ఈ పార్టీ నిర్వహించిన వాసు బెట్టింగ్ బుకీగా పోలీసులు గుర్తించారు. విజయవాడకు చెందిన వాసు క్రికెట్ బెట్టింగ్‌ ద్వారా అనతికాలంలోనే కోట్లకు పడగెత్తాడని వెల్లడించారు.

More News

Komatireddy Venkat Reddy:జూన్ 4 తర్వాత బీఆర్ఎస్ భూస్థాపితం: కోమటిరెడ్డి

లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోస్యం చెప్పారు.

Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానికి తీవ్ర అస్వస్థత.. ఆందోళనలో కుటుంబసభ్యులు..!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుడివాడలోని తన స్వగృహంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడుతూ అకస్మాత్తుగా సోఫాలో

TGSRTC:టీజీఎస్ఆర్టీసీ లోగోపై ప్రభుత్వం కీలక ప్రకటన

తెలంగాణ రాష్ట్ర సంక్షిప్త పదం టీఎస్‌ నుంచి టీజీగా మారిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తికి అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం ఇటీవలే టీజీ పేరును

Ilaiyaraaja:ఇళయరాజా తీవ్ర ఆగ్రహం.. 'మంజుమ్మల్ బాయ్స్' యూనిట్‌కి నోటీసులు

ఇళయరాజా సంగీత ప్రియులకు ఓ వ్యసనం లాంటి వారు. ముఖ్యంగా 80, 90 దశకాల్లో తెలుగు, తమిళ్ సినిమాలకు ఎన్నో గొప్ప పాటలకు సంగీతం ఇచ్చారు.

Pinnelli:పిన్నెల్లి కోసం పోలీసులు ముమ్మర వేట.. ఈసీకి డీజీపీ నివేదిక..

పోలింగ్ ముగిసినా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ఘర్షణలు మాత్రం ఇంకా తగ్గడం లేదు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయ్ గేట్‌ పోలింగ్ కేంద్రంలో