RRR: నా మైండ్ లోనుంచి పోవట్లేదు.. 'దోస్తీ' సాంగ్ పై హేమచంద్ర
Send us your feedback to audioarticles@vaarta.com
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్. ఇటీవల విడుదలైన రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ మేకింగ్ వీడియోతో ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఆర్ఆర్ఆర్ చిత్రం ఏస్థాయిలో ఉండబోతోందో మేకింగ్ వీడియోలో చూపించారు.
ఇదీ చదవండి: హాట్ ఫోటోస్: బ్రాలో పరువాల హొయలు.. సారా స్టన్నింగ్ ఫోజులు
ఇక ఆగష్టు 1న ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ప్రేక్షకులని థ్రిల్ చేసేందుకు జక్కన్న టీం వర్క్ చేస్తోంది. ఆర్ఆర్ఆర్ థీమ్ సాంగ్ ని ఆరోజు విడుదల చేయబోతున్నారు. సాంగ్ ఒకెత్తయితే.. రాజమౌళి ఈ ప్రమోషనల్ సాంగ్ ని షూట్ చేసిన విధానం మరో ఎత్తు అన్నట్లుగా సమాచారం అందుతోంది.
తాజాగా దోస్తీ పాట పాడిన ప్రముఖ సింగర్ హేమచంద్ర ఇదే విషయాన్ని ఖరారు చేశారు. దోస్తీ సాంగ్ పై హేమచంద్ర చెప్పన ఆసక్తికర వివరాల వీడియో బైట్ విడుదలైంది.
'రాజమౌళి గారు, కీరవాణి గారి కాంబినేషన్ వర్క్ చేయడం నాకు ఇదే ఫస్ట్ టైం. నాకు ఇది డ్రీమ్ లాంటిది. ఈ ప్రమోషనల్ సాంగ్ తాయారవుతున్న విధానం అద్భుతం. పాట పాడడం, ఆ తర్వాత సాంగ్ షూట్ అంతా నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. ఇంత పెద్ద చిత్రానికి వర్క్ చేస్తున్నప్పుడు సరిగా పాడతాన లేదా అనే ప్రెజర్ ఉంటుంది. ఇది బిగ్గెస్ట్ పాన్ ఇండియా ఫిలిం. రాజమౌళి గారు ఈ సాంగ్ ని షూట్ చేసిన విధానం నా మైండ్ లోనుంచి పొవట్లేదు.. మైండ్ బ్లోయింగ్. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అందమైన లిరిక్స్ అందించారు. ఈ సాంగ్ మొత్తం ఒక ప్యాకేజ్' అని హేమచంద్ర దోస్తీ సాంగ్ పై అంచనాలు పెంచేశాడు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రాంచరణ్ కలసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ఇది. కొమరం భీం, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో ఎన్టీఆర్, చరణ్ నటిస్తున్నారు. సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మిగిలి ఉంది. అక్టోబర్ 13న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కు ఆర్ఆర్ఆర్ రెడీ అవుతోంది. అలియా భట్, అజయ్ దేవగన్, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com