close
Choose your channels

వామ్మో.. హేమను ప్రెగ్నెన్సీ టెస్ట్ అడిగారు.. కిడ్నాప్!!

Tuesday, July 30, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వామ్మో.. హేమను ప్రెగ్నెన్సీ టెస్ట్ అడిగారు.. కిడ్నాప్!!

తెలుగు రియాల్టీ బిగ్‌బాస్-3 షో సీజన్ మొదలవుతుందని అనే టాక్ వచ్చినప్పట్నుంచి.. నేటికీ వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. ఓ వైపు తమను కంటెస్టెంట్లుగా ఎంపిక చేసి చివరికి మోసం చేశారని యాంకర్ శ్వేతారెడ్డి, నటి గాయత్రీ గుప్తా ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. మరోవైపు.. ఈ షోను పూర్తిగా ఆపేయాలని.. షో ప్రసారం చేసే ముందు సెన్సార్ చేయాలని దర్శకనిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి కూడా పిటిషన్ దాఖలు చేయగా.. అటు ఢిల్లీలో.. ఇటు అమరావతిలో ఆయన ధర్నా, నిరసనలు చేపడుతున్నారు. అంతేకాదు.. దేశ వ్యాప్తంగా ధర్నాకు దిగుతానన్నారు.

ఇదిలా ఉంటే.. బిగ్‌బాస్ హౌస్ నుంచి ఔట్ అయిన సీనియర్ నటి హేమ సంచలన ఆరోపణలు చేశారు. ‘ఆడిషన్స్‌లో భాగంగా తనను ఇబ్బంది కలిగించే ప్రశ్నలు అయితే అడగలేదన్నారు. కానీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోమన్నారని.. ఒకవేళ తాను ప్రెగ్నెన్సీగా ఉంటే మూడు నెలలు అక్కడ ఉండటం కష్టం అనే అభిప్రాయం అడిగారన్నారు. అయితే వాళ్లు అడిగినదాన్ని తప్పు అని చెప్పడం లేదన్నారు. బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయిన తరువాత ఒక్కరోజు వాళ్లు తనను కిడ్నాప్ చేశారని.. ఆ తర్వాతి రోజు ఎపిసోడ్ ప్రసారం అయిన తరువాతే బయటకు పంపారని హేమ చెప్పుకొచ్చారు. అంతటితో ఆగని ఆమె తనకు ఇప్పటి వరకూ ఇండస్ట్రీలో రెబల్, నవ్వుల హేమ అనే టైటిల్స్ ఉన్నాయని ఆ రెండూ చాలని.. ఇక ఈ కాంట్రవర్శీ అనే టైటిల్ తనొకొద్దన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment