అలరించేలా 'హలో' టీజర్
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'హలో' మూవీ టీజర్ వచ్చేసింది. “ది లక్కీయస్ట్ పీపుల్ బోర్న్ ఆన్ థిస్ ఎర్త్, వాళ్ళు మాత్రం.. ఎవరేం చేసినా ఏం అడ్డొచ్చినా తమ సోల్ మేట్ ని కలుస్తారు, లైఫ్ ని షేర్ చేసుకుంటారు." అంటూ నాగార్జున అందించిన వాయిస్ ఓవర్ బాగుంది.
అలాగే టీజర్లో తన సోల్ మేట్ ని కలుసుకోవడానికి అక్కినేని అఖిల్ చేసిన స్టంట్స్ కూడా హాలీవుడ్ సినిమాల రేంజ్ ని తలపిస్తున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్ ప్రైజెస్ సంయుక్తంగా నిర్మించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ని మనం, 24 చిత్రాల దర్శకుడు విక్రమ్ కుమార్ రూపొందిస్తున్నారు.
ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె కళ్యాణి ప్రియదర్శన్ ఇందులో అఖిల్ కు జోడిగా నటిస్తోంది. ఈమెకు ఇదే తొలి తెలుగు చిత్రం కావడం విశేషం. జగపతిబాబు, రమ్యకృష్ణ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతమందించారు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 22న ఈ చిత్రం థియేటర్‌లో సందడి చేయడానికి సిద్ధమౌతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com