హలో.. రమ్యకృష్ణకి ఎంతో స్పెషల్
Send us your feedback to audioarticles@vaarta.com
రమ్యకృష్ణ.. ఒకప్పుడు గ్లామర్ హీరోయిన్. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్. అయితే అప్పుడు.. ఇప్పుడు.. ఒక పాయింట్ మాత్రం కామన్. అదేమిటంటే.. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోవడం. అమ్మోరు, నరసింహా, బాహుబలి, బాహుబలి 2 చిత్రాలే అందుకు నిదర్శనం. ఇదిలా ఉంటే.. హలో చిత్రం రమ్యకృష్ణకి రెండు విధాలా ప్రత్యేకం.
అదెలాగంటే.. ఒకప్పుడు నాగార్జునకి జోడీగా నటించిన రమ్య.. ఇందులో నాగ్ తనయుడు అఖిల్‌కి అమ్మగా నటించడం ఓ ప్రత్యేకత. మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఒకప్పటి హీరోయిన్ లిజితో మామాశ్రీ అనే సినిమాలో కలిసి నటించిన రమ్యకృష్ణ.. ఇప్పుడు లిజి కుమార్తె కల్యాణి ప్రియదర్శన్ తో కలిసి హలో లో నటించడం.
అంటే.. ఒకే సినిమాలో ఒకప్పటి తన హీరో నాగ్ కి కొడుకు అయిన అఖిల్‌తోనూ.. అలాగే ఒకప్పటి తన తోటి హీరోయిన్ లిజికి కుమార్తె అయిన కల్యాణితోనూ కలిసి నటిస్తోందన్నమాట. తన ఫ్రెండ్స్ పిల్లలతో రమ్య చేసే సందడి ఎలా ఉంటుందో తెలియాలంటే డిసెంబర్ 22 వరకు వెయిట్ చేయాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments