'హలో'.. మెరిసే మెరిసే పాట విశ్లేషణ
Send us your feedback to audioarticles@vaarta.com
విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'హలో'. అఖిల్ అక్కినేని, కళ్యాణి ప్రియదర్శన్ జంటగా నటించిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, జగపతిబాబు, అజయ్ ముఖ్య పాత్రలు పోషించారు. నాగార్జున నిర్మించిన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్టరు. రెండు రోజుల క్రితం.. రమ్యకృష్ణ, జగపతి బాబు, అఖిల్, కళ్యాణి ప్రియదర్శన్ లపై చిత్రీకరించిన పాటను.. నాగార్జున బిట్ సాంగ్‌గా విడుదల చేసిన సంగతి తెలిసిందే.
మ్యారేజ్ ఫంక్షన్లో (సంగీత్)లో వచ్చే పాట ఇది. శుక్రవారం అఖిల్ పూర్తి పాటని ట్విట్టర్‌లో విడుదల చేశారు. “మెరిసే మెరిసే మెరిసే ఆ కన్నుల్లో ఏదో మెరిసే.. ఆ మనసే మురిసే మురిసే ఆ సంగతి నాకు తెలుసే” అని పల్లవితో మొదలై.. చరణంలో “రెండు గుండెల చప్పుడు ఒక్కటై, మూడు ముళ్ళ ముచ్చట కాగా, ఈడు జోడు కలిసి, తోడు నీడై సాగగా” అంటూ పెళ్లిలోని మాధుర్యాన్ని, ఆ జంట అనుబంధాన్ని ఎంతో చక్కగా చెప్తూనే.. పెళ్ళైన తర్వాత కింగ్ లాంటి మగాడు కూడా భార్య ఏది చెప్తే అది చేస్తేనే ఆ జీవితం సాఫీగా సాగుతుంది అంటూ నాగార్జున హీరోగా వచ్చిన మన్మథుడు` సినిమాలో “వద్దురా సోదరా” పాటను గుర్తుకు తెచ్చారు గీత రచయిత.
ఎంతో ఖర్చు పెట్టి వేసిన సెట్, ఈ పాటని చూస్తుంటే హిందీ సినిమాలు గుర్తొస్తాయి. ముఖ్యంగా కరణ్ జోహార్ సినిమా 'కభి ఖుషి కభి ఘమ్'లో 'బోలె చూడియాన్' పాటని దృష్టిలో పెట్టుకుని ఈ పాటని మలిచినట్టున్నారు. మొత్తానికి ఈ పాట వినడానికి, చూడడానికి కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ డిసెంబర్ 10న వైజాగ్ లో జరుగనుంది. అలాగే ఈ మూవీని డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments