36వ ఎంట్రీగా 'హలో'
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని అఖిల్, కల్యాణి ప్రియదర్శన్ హీరోహీరోయిన్లుగా మనం, 24 చిత్రాల దర్శకుడు విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో రూపొందిన ప్రేమకథా చిత్రం హలో. అక్కినేని నాగార్జున ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ 22న విడుదలైన సంగతి తెలిసిందే. క్యూట్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమాకి విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
అంతేకాకుండా.. తెలుగు రాష్ట్రాల్లో, ఓవర్సీస్‌లో ఈ సినిమాకి మంచి వసూళ్ళే దక్కాయి. అయితే.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం కావడంతో కొన్ని చోట్ల నష్టాలు తప్పలేదు. ఇదిలా ఉంటే.. ఓవర్సీస్ మార్కెట్‌లో ప్రతిష్ఠాత్మకంగా భావించే మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి హలో చేరింది.
శనివారం వచ్చిన కలెక్షన్లతో హలో ఈ జాబితాలో స్థానం దక్కించుకుంది. ఇప్పటివరకు ఈ జాబితాలో 35 తెలుగు చిత్రాలు ఉండగా.. 36వ చిత్రంగా హలో చేరడం విశేషం. దూకుడుతో మొదలైన ఈ మిలియన్ డాలర్ల క్లబ్ ప్రస్థానం.. తెలుగు సినిమాలకి కలెక్షన్ల పరంగా ఓ కొలమానంగా మారిందిప్పుడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com