శర్వానంద్ తో 'హలో' భామ
- IndiaGlitz, [Saturday,February 03 2018]
గతేడాది విడుదలైన శతమానం భవతి, మహానుభావుడు చిత్రాలు ఇచ్చిన ఫలితాలతో మంచి ఉత్సాహంతో ఉన్నారు యువ కథానాయకుడు శర్వానంద్. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ యంగ్ హీరో.. స్వామి రారా, కేశవ చిత్రాల దర్శకుడు సుధీర్ వర్మ డైరెక్షన్‌లో ఒక మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. శర్వానంద్ మొదటిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా..
ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. కాగా, ఇప్పటికే ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు (కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్) నటిస్తున్నట్లు ప్రకటించింది చిత్ర యూనిట్. అయితే కొన్ని కారణాల వల్ల నిత్యా ఈ సినిమా నుంచి తప్పుకోగా...ఆమె స్థానంలో హలో' భామ కల్యాణి ప్రియదర్శినిని ఎంపిక చేసినట్టు టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే గనక నిజమైతే ఈ మలబార్ సుందరికి మరో మంచి అవకాశం దొరికినట్టే. త్వరలోనే కల్యాణి ఎంపిక విషయమై అధికారిక ప్రకటన వెలువడుతుంది.