హాలీవుడ్ సినిమా ఆధారంగా 'హ‌లో'?

  • IndiaGlitz, [Wednesday,December 20 2017]

అక్కినేని అఖిల్ రీ లాంచ్ మూవీగా తెర‌కెక్కిన చిత్రం హ‌లో. ఇష్క్‌, మ‌నం, 24.. ఇలా వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న డిఫ‌రెంట్ చిత్రాల ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె.కుమార్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ప్రియ‌ద‌ర్శ‌న్ కుమార్తె క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ ఈ చిత్రం ద్వారా క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మ‌వుతోంది.

అక్కినేని నాగార్జున నిర్మించిన ఈ చిత్రంతో సంగీత ద‌ర్శ‌కుడు అనూప్ రూబెన్స్ 50 చిత్రాల‌ని పూర్తిచేసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే.. చిన్న‌ప్పుడే దూర‌మైన త‌న సోల్‌మేట్‌ని క‌లుసుకునేందుకు క‌థానాయ‌కుడు చేసే ప్ర‌య‌త్నాల స‌మాహారంగా హ‌లో రూపొందిన సంగ‌తి తెలిసిందే.

అయితే తాజాగా వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం.. ఈ సినిమా 2004లో వ‌చ్చిన అమెరిక‌న్ యాక్ష‌న్ క్రైమ్ థ్రిల్ల‌ర్ సెల్యూల‌ర్ ఆధారంగా తెర‌కెక్కింద‌ని గాసిప్స్ వినిపిస్తున్నాయి.

మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత నిజ‌ముందో.. మ‌రో రెండు రోజుల్లో తెలుస్తుంది. ఈ నెల 22న రానున్న హ‌లో సినిమాపై అక్కినేని అభిమానుల్లో మంచి అంచ‌నాలే ఉన్నాయి.

More News

విజ‌య్ దేవ‌ర‌కొండ పాత్ర‌లో షాహిద్‌

అర్జున్ రెడ్డి.. ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చి సంచ‌ల‌న విజ‌యం సాధించిన తెలుగు చిత్ర‌మిది. ఈ చిత్రంతో యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోయాడు. ప్ర‌స్తుతం చేతినిండా సినిమాల‌తో బిజీగా మారాడు. ఇక ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా కూడా అగ్ర క‌థానాయ‌కుల దృష్టిలో ప‌డ్డాడు.

'దీర్ఝ ఆయుష్మాన్ భవ' టైటిల్ లొగొ విడుదల

వింగ్స్ మూవీ మేక‌ర్స్ బేన‌ర్‌పై కార్తీక్‌రాజు, మిస్తి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా  జి.ప్రతిమ ఓ  చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం విదితమే‌.ఎం.పూర్ణానంద్‌ ఈ చిత్రానికి దర్శకుడు‌. సోషియో ఫాంటసీ గా తెరకెక్కుతొన్న ఈ చిత్రానికి "దీర్ఘ ఆయుష్మాన్ భవ" అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.

'2 కంట్రీస్' సెన్సార్ పూర్తి

సునీల్, మ‌నీషా రాజ్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం '2 కంట్రీస్‌'. మ‌హాల‌క్ష్మి ఆర్ట్స్ ప‌తాకంపై ఎన్‌.శంక‌ర్ స్వీయ ద‌ర్శ‌క నిర్మాణంలో సినిమాను రూపొందించారు.

'ఇండియన్ 2' సినిమాకు సంగీత దర్శకుడెవరో తెలుసా?

శంకర్ సినిమాలకు ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తూ వస్తున్నాడు.

నెల రోజుల గ్యాప్ లో ఆరు చిత్రాలు

యువ సంగీత దర్శకుడు తమన్ కి ఈ ఏడాది చెప్పుకోదగ్గ ఫలితాన్నేఇచ్చింది.