వైజాగ్ లో 'హలో' ఆడియో
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని అఖిల్ కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం అఖిల్` ఆశించిన ఫలితం సాధించలేదు. ప్రస్తుతం.. టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ కాంబినేషన్లో తన రెండో చిత్రాన్ని చేస్తున్నాడీ యువ కథానాయకుడు. ఆ సినిమానే హలో`. కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నారు.
ఇటీవల రిలీజైన ఈ చిత్రం టీజర్ కి మంచి స్పందన వచ్చింది. హలో` సినిమాని చాలా గ్రాండ్ గా ప్రమోషన్ చేయడానికి.. అవసరమైతే తనే స్వయంగా ప్రమోషన్స్ లో పాల్గొంటానని నాగ్ వెల్లడించారు. కాగా, వైజాగ్ పోర్ట్ స్టేడియంలో డిసెంబర్ 10న ఆడియో లాంచ్ ని చాలా పెద్ద ఎత్తున నిర్వహించడానికి యూనిట్ ప్లాన్ చేసింది. అలాగే హైదరాబాద్ లో డిసెంబర్ మూడవ వారంలో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ని కూడా నిర్వహించనున్నారు.
అనూప్ రూబెన్స్ మ్యూజిక్ ని అందించిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించిన ఈ మూవీ డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments