కిరణ్ అబ్బవరం 'సెబాస్టియన్ పిసి524'లో 'హేలి...' సాంగ్ విడుదల

  • IndiaGlitz, [Thursday,February 17 2022]

టాలెంట్‌ ఉన్నోళ్లకు టాలీవుడ్‌ ఎప్పుడూ వెల్కమ్‌ చెబుతుంది. కథానాయకుడిగా పరిచయమైన 'రాజావారు రాణిగారు' సినిమాతో కంటెంట్‌ ఉన్న కుర్రాడని కిరణ్‌ అబ్బవరం పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత 'ఎస్ఆర్ కళ్యాణమండపం'తో మరో సాలిడ్ సక్సెస్ అందుకున్నారు. క్లాసు - మాసు, యూత్ - ఫ్యామిలీ... అన్ని వర్గాల ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ అందుకోవడానికి రెడీ అవుతున్నారు. 'సెబాస్టియన్ పిసి 524'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

కిరణ్‌ అబ్బవరం కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'సెబాస్టియన్‌ పిసి524'. కోమలీ ప్రసాద్‌, నువేక్ష (నమ్రతా దరేకర్‌) హీరోయిన్లు.  జ్యోవిత సినిమాస్ పతాకంపై ఎలైట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో  సిద్ధారెడ్డి బి, జయచంద్ర రెడ్డి, రాజు, ప్రమోద్ నిర్మించారు. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించారు. ప్రపంచవ్యాప్తంగా సినిమాను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ సంస్థ విడుదల చేస్తోంది. ఈ రోజు సినిమాలో 'హేలి...' సాంగ్ విడుదల చేశారు.

సినిమాలో హీరోయిన్ నువేక్ష పేరు హేలి. హీరోకి, ఆమెకు మధ్య సాగే ప్రేమ గీతమిది. జిబ్రాన్ సంగీతంలో కపిల్ కపిలాన్ ఆలపించారు.

'నీ మాట వింటే రాదా మైమరపే...
నీ పేరు అంటే రాదా మైమరపే...' అంటూ సనపాటి భరద్వాజ పాత్రుడు పాటను రాశారు. ఈ సినిమా పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల అవుతున్నాయి.

రేచీకటి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. రేచీకటి గల హీరోకి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం వస్తుంది. అతడు నైట్ టైం డ్యూటీ ఎలా చేశాడు? రేచీకటి వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? అనేది సినిమా కథాంశంగా తెలుస్తోంది.

కిరణ్ అబ్బవరం, కోమలీ ప్రసాద్, నువేక్ష (నమ్రతా దారేకర్), శ్రీకాంత్ అయ్యంగార్, సూర్య, రోహిణీ రఘువరన్, ఆదర్ష్ బాలకృష్ణ, జార్జ్, సూర్య, మహేష్ విట్టా, రవితేజ, రాజ్ విక్రమ్, లత, ఇషాన్, రాజేష్ తదితరులు 'సెబాస్టియన్ పిసి524'లో ప్రధాన పాత్రలు పోషించారు.

ఈ చిత్రానికి పీఆర్వో: సురేంద్రకుమార్‌ నాయుడు – ఫణి కందుకూరి (బియాండ్‌ మీడియా), డిజిటల్‌ పార్ట్‌నర్‌: టికెట్‌ ఫ్యాక్టరీ, పబ్లిసిటీ డిజైన్: చవన్ ప్రసాద్, స్టిల్స్: కుందన్ - శివ, సౌండ్: సింక్ సినిమాస్ సచిన్ సుధాకరన్, కాస్ట్యూమ్స్: రెబెకా - అయేషా మరియమ్, ఫైట్స్: అంజి మాస్టర్, సిజి: వీర, డీఐ: రాజు, కూర్పు: విప్లవ్‌ న్యసదాం, కళ: కిరణ్‌ మామిడి, ఛాయాగ్రహణం: రాజ్‌ కె. నల్లి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె.ఎల్. మదన్, సమర్పణ: ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్, నిర్మాణ సంస్థ: జ్యోవిత సినిమాస్, సంగీతం: జిబ్రాన్, నిర్మాతలు: సిద్ధారెడ్డి బి, జయచంద్ర రెడ్డి, ప్రమోద్‌, రాజు, కథ - దర్శకత్వం: బాలాజీ సయ్యపురెడ్డి.

More News

టాలీవుడ్‌కు బిగ్‌ రిలీఫ్.. రేపటి నుంచి థియేటర్‌లలో 100 శాతం ఆక్యూపెన్సీ

తెలుగు చిత్ర పరిశ్రమ- ఏపీ ప్రభుత్వానికి మధ్య నలుగుతున్న సమస్యలకు ఓ పరిష్కారం లభించేలా కనిపిస్తోంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి బృందం, మంచు విష్ణులు ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు.

నాపైనా, నా ఫ్యామిలీపైనా ట్రోలింగ్.. ఓ ఇద్దరు హీరోల పనే ఇది, శిక్ష తప్పదు : మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు

తనపైనా, తన కుటుంబంపైనా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న వారికి కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు వార్నింగ్ ఇచ్చారు. టాలీవుడ్‌కి చెందిన ఓ ఇద్దరు హీరోలు దీని వెనుక వున్నారని..

అమితాబ్ బాడీగార్డ్‌‌గా విధులు.. కానిస్టేబుల్ ఆస్తులు చూసి షాకైన అధికారులు

ప్రముఖులు, సెలబ్రెటీల పేర్లు చెప్పి.. లేదా వాళ్లతో ఫోటోలు దిగి కేటుగాళ్లు పలువురిని మోసం చేసిన ఉదంతాలు ఎన్నో. అయితే ఈ కేసులో మాత్రం ఏకంగా సెలబ్రెటీ దగ్గర పనిచేసిన మాజీ అంగరక్షకుడు కోట్లు వెనకేశాడు.

మాట నిలబెట్టుకున్న కింగ్ నాగార్జున.. వెయ్యి ఎకరాల అటవీ భూమి దత్తత

అగ్ర కథానాయకుడు, కింగ్ నాగార్జున తన మాట నిలబెట్టుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తితో 1,080 ఎకరాల అటవీ భూమిని ద‌త్త‌త

చిన్నారులను బైకుపై తిప్పుతున్నారా.. కొత్త రూల్ తెలుసా..?

చిన్నారులను బైకులపై ఎక్కించుకుని ఊరంతా తిప్పుతున్నారా..