ఆకట్టుకునే 'హేజా' టీజర్..!!

  • IndiaGlitz, [Saturday,July 06 2019]

మిస్టర్ 7 , యాక్షన్ 3D , చిత్రం చెప్పిన కథ, మామ ఓ చందమామ చిత్రాలకు సంగీత దర్శకుడిగా చేసిన మున్నా కాశీ దర్శకత్వం వహిస్తూ హీరో గా చేసిన చిత్రం హేజా.. ముమైత్ ఖాన్, నూతన నాయుడు , లిజి గోపాల్, ప్రీతం నిగమ్ ఇతర పత్రాలు పోషించారు.. కాగా ఈ చిత్రానికి సంగీతం హైలైట్ గా నిలవనుంది.. చాల రోజుల తర్వాత నటి ముమైత్ ఖాన్ ఈ చిత్రం తో రీ ఎంట్రీ స్తుండగా వి ఎన్ వి క్రియేషన్స్ పతాకంపై కెవిఎస్ఎన్ మూర్తి ఈ చిత్రాన్ని నిర్మించారు.. నాని చమిడిశెట్టి సినిమాటోగ్రఫీ ని అందించారు.. హారర్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ చివరిదశలో ఉండగా చిత్ర బృందం నేడు టీజర్ ని రిలీజ్ చేసింది..

ఈ సందర్భంగా దర్శకుడు, హీరో మున్నా కాశి మాట్లాడుతూ... ఇప్పటి వరకు చాల సినిమా లకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశాను.. ఫస్ట్ టైం హీరోగా, దర్శకుడిగా మరి చేస్తున్న సినిమా ఇది.. ఈ సినిమా కి సపోర్ట్ చేసిన అందరికి కృతజ్ఞతలు.. ఈ సినిమా తో ముమైత్ ఖాన్ గారు రీ ఎంట్రీ ఇస్తున్నారు..ఇప్పటివరకు వచ్చిన సినిమా అవుట్ ఫుట్ చాల బాగా ఉంది.. ఈ సినిమా అందరిని తప్పకుండా మెప్పిస్తుంది అన్నారు..

నిర్మాత కెవిఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ.. ఇప్పటివరకు వచ్చిన అన్ని హారర్ సినిమాలకు డిఫరెంట్ గా ఈ సినిమా ఉండబోతుంది.. దర్శకుడు ఎంతో క్లారిటీగా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా సినిమా చేశారు.. ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.. త్వరలో అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదల చేస్తాం.. అన్నారు..

నటీనటులు : మున్నా కాశి , ముమైత్ ఖాన్, నూతన నాయుడు , లిజి గోపాల్, ప్రీతం నిగమ్ తదితరులు...