అందాలన్నీ చూపిస్తూ కొంటెగా సాకు చెప్పిన హెబ్బా పటేల్
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ బ్యూటీ హెబ్బా పటేల్ టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్. హెబ్బా పటేల్ కు క్రేజ్ తీసుకువచ్చిన చిత్రం కుమారి 21ఎఫ్. హెబ్బా అందాలకు కుర్రకారు ఫిదా అయ్యారు. ఆ తర్వాత కూడా హెబ్బాకు కొన్ని హిట్స్ పడ్డాయి. కానీ ఎందుకో ఆ మొమెంటంని హెబ్బా కొనసాగించలేకపోయింది.
ఇదీ చదవండి: ప్రియదర్శి డెడికేషన్ కి క్లాప్స్ కొట్టాల్సిందే.. ఆ బాధ భరిస్తూ..
ఏది ఏమైనా హెబ్బా ఇప్పటికి కొన్ని అవకాశాలు అందుకుంటూనే ఉంది. హెబ్బా పటేల్ తాజాగా ఇంటర్నెట్ లో హీటెక్కించే పోస్ట్ షేర్ చేసింది. దిమ్మతిరిగే సెక్సీ లుక్ లో ఉన్న పిక్ ని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ పిక్ చూస్తున్న నెటిజన్లు లైకులు, కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. హెబ్బా అందాలు అంత హాట్ గా ఉన్నాయి మరి.
ఈ పిక్ లో తాను ధరించిన డ్రెస్ పై కొంటెగా ఓ సాకు చెప్పింది హెబ్బా. 'బయటకు ఎక్కువగా వెళ్లడం లేదు.. కాబట్టి పొట్టి బట్టలు వేసుకుంటున్నా' అని హెబ్బా కామెంట్ పెట్టింది. ప్రస్తుతం కరోనా వల్ల బయట ఎక్కువగా తిరగలేని పరిస్థితి.. అందుకే ఇంట్లో ఇలా పొట్టి దుస్తులు వేసుకుంటున్నా అని అర్థం వచ్చేలా చెప్పింది హెబ్బా పటేల్.
హెబ్బా పటేల్ ప్రస్తుతం 'ఓదెల రైల్వేస్టేషన్' అనే చిత్రంలో నటిస్తోంది. హెబ్బా చివరగా రామ్ రెడ్ మూవీలో 'డించాక్' అనే ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com