నాలుగోసారి కూడా కలిసొస్తుందా?
- IndiaGlitz, [Wednesday,October 04 2017]
చిన్న చిత్రాల్లో నటించినప్పటికీ.. మంచి క్రేజ్‌నే మూటగట్టుకుంది యంగ్ హీరోయిన్ హెబా పటేల్. అలా ఎలాతో తెలుగులో కెరీర్‌ని ఆరంభించిన ఈ ముద్దుగుమ్మ కి ఆ చిత్రం మంచి విజయాన్నే అందించింది. ఆ తరువాత వచ్చిన కుమారి 21 ఎఫ్, ఈడో రకం ఆడో రకం, ఎక్కడికి పోతావ్ చిన్నవాడా కూడా సక్సెస్ అవడంతో.. హెబా గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. అయితే నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, మిస్టర్, అంధగాడు చిత్రాలు ఆశించిన విజయం సాధించకపోవడంతో.. హెబా కష్టకాలం కూడా చూడాల్సి వచ్చింది.
ఈ నేపథ్యంలో ఆమె తదుపరి చిత్రం ఏంజెల్ విడుదలకి రెడీ అవుతోంది. నాగ అన్వేష్ హీరోగా నటించిన ఈ సోషియో ఫాంటసీ చిత్రానికి బాహుబలి పళని డైరెక్టర్. నవంబర్ 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో హెబా హీరోయిన్గా.. నవంబర్‌లో వచ్చిన మూడు చిత్రాలు అలా ఎలా, కుమారి 21 ఎఫ్, ఎక్కడికి పోతావు చిన్నవాడా కమర్షియల్‌గా వర్కవుట్ అయ్యాయి. మరి ఏంజెల్ విషయంలోనూ హెబాకి.. నవంబర్ నాలుగోసారి కలిసొస్తుందేమో చూడాలి.