రామ్ కోసం హెబ్బా ఐటెమ్ సాంగ్
Send us your feedback to audioarticles@vaarta.com
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘రెడ్’. కిషోర్ తిరుమల దర్శకత్వంలో స్రవంతి మూవీస్ బ్యానర్‌పై స్రవంతి రవికిషోర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రీసెంట్గా యూరప్‌లో రెండు పాటలను చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్లో చివరి పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ పాట చిత్రీకరణతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నది ఐటెమ్ సాంగ్. సమాచారం మేరకు ఈ సాంగ్‌లో హెబ్బా పటేల్ రామ్‌తో నర్తిస్తుందట.
తమిళ చిత్రం తడంకు తెలుగు రీమేక్‌గా రూపొందుతోన్న రెడ్‌లో రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. రామ్ తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తోన్న చిత్రమిది. ఏప్రిల్ 9న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. నేనుశైలజ, ఉన్నది ఒకటే జిందగీ చిత్రాల తర్వాత రామ్, కిషోర్ తిరుమల కాంబినేషన్లో రూపొందుతోన్న మూడో చిత్రమిది. ప్రస్తుతం హెబ్బా పటేల్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లోనూ నటిస్తుంది. ఈమె రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగా చిత్రంలోనూ కీలక పాత్రలో నటించింది. ఇప్పుడు ఈమెకు మెయిన్ హీరోయిన్గా కంటే సెకండ్ హీరోయిన్‌గానే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com