విలనిజం చూపించనున్న హాట్ భామ
Send us your feedback to audioarticles@vaarta.com
`అలాఎలా`తో హీరోయిన్గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన హెబ్బా పటేల్‌కు బ్రేక్ వచ్చింది మాత్రం `కుమారి 21f`తోనే సుకుమార్ నిర్మాణంలో పల్నాటి సూర్య ప్రతాప్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఈ సినిమాతో వరుస అవకాశాలను దక్కించుకున్నప్పటికీ సరైన ప్లానింగ్ లేకపోవడంతో ప్లాపులను చవిచూసింది. ఓ రకంగా కెరీర్ డైలామాలో పడింది. ఈ నేపథ్యంలో `24 కిస్సెస్`లో లిప్‌లాక్స్ చేసి కుర్రకారును ఆకట్టుకునే ప్రయత్నమైతే చేసింది. అయితే ఆ సినిమా కూడా పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో ఏం చేయాలనే ఆలోచనలో పడింది. సన్నబడింది.
గ్లామర్ డోస్ పెంచడంతో పాటు పెర్ఫామెన్స్ పాత్రలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఇలాంటి తరుణంలో ఈ అమ్మడుకి నితిన్ `భీష్మ` చిత్రంలో అవకాశం వచ్చింది. అయితే మెయిన్ హీరోయిన్గా కాదు.. సెకండ్ హీరోయిన్గా అనుకున్నారు. అయితే షాకింగ్ విషయమేమంటే.. ఈ అమ్మడు భీష్మలో గ్లామర్ హీరోయిన్గా కాకుండా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో సందడి చేయబోతుందని సినీ వర్గాల సమాచారం. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా మెయిన్ హీరోయిన్గా నటిస్తుంది.
క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేయడానికి సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ ప్రయత్నాలు చేస్తున్నారు. `అఆ` తర్వాత చాలా కాలంగా మంచి విజయం కోసం ఎదురుచూస్తున్న నితిన్ `భీష్మ`పై చాలా ఆశలనే పెట్టుకున్నాడు. మరి నితిన్ ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో తెలుసుకోవాలంటే క్రిస్మస్ వరకు వేచిచూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout