డాక్టరుగా హెబ్బా పటేల్.....
Send us your feedback to audioarticles@vaarta.com
అలా ఎలా, కుమారి 21 ఎఫ్, ఈడోరకం-ఆడోరకం చిత్రాల తర్వాత ఇప్పుడు ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రంతో సక్సెస్‌తో హెబ్బా పటేల్ లక్కీ హీరోయిన్గా మారిపోయింది. మరోవైపు నాన్న, నేను నా బాయ్‌ఫ్రెండ్స్, ఏంజెల్, అంధగాడు చిత్రాల్లో నటిస్తుంది. సినిమాల ఎంపికతో పాటు పాత్రల ఎంపికలో కూడా హెబ్బా చాలా డిఫరెంట్‌గానే సెలక్ట్ చేసుకుంటుంది.
ఇప్పుడు రాజ్‌తరుణ్‌తో హెబ్బా చేస్తున్న అంధగాడు చిత్రంలో హెబ్బా పటేల్ డాక్టరు పాత్రలో కనపడనుందట. రచయిత వెలిగొండ శ్రీనివాస్ దర్శకుడుగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో హెబ్బా పటేల్ పాత్ర చాలా ఆసక్తికరంగా సాగుతుందట. కుమారి 21 ఎఫ్, ఈడోరకం-ఆడోరకం చిత్రాల తర్వాత రాజ్‌తరుణ్, హెబ్బా కలిసి చేస్తున్న మూడో చిత్రం అంధగాడుతో ఈ జంట మరో హిట్ అందుకోవాలని కోరుకుందాం...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout