తమన్నా ప్లేస్ లో హెబ్బా...

  • IndiaGlitz, [Saturday,June 10 2017]

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌చైతన్య‌, త‌మ‌న్నా జంట‌గా రూపొందిన 100% ల‌వ్ సినిమా మంచి విజ‌యాన్ని సాదించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు సుకుమార్ త‌న అసిస్టెంట్ చంద్ర‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళంలో నిర్మించ‌డానికి ప్లాన్ చేశాడు. మ్యూజిక్ డైరెక్ట‌ర్ జి.వి.ప్ర‌కాష్ చైతు స్థానంలో హీరోగా న‌టిస్తుంటే, త‌మ‌న్నా స్థానంలో ఎవ‌రు న‌టిస్తార‌ని దానిపై చాలా డిస్క‌ష‌న్స్ జ‌రిగాయి. అయితే ఇప్పుడు త‌మ‌న్నా స్థానంలో న‌టించే హీరోయిన్స్ ప్లేస్‌లో చాలా ఇద్ద‌రి ముగ్గురు పేర్లు వినిపించాయి.

ముఖ్యంగా లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ని అన్నారు. అయితే లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ సినిమాలో త‌మ‌న్నా ప్లేస్‌లో హెబ్బా ప‌టేల్ జివి ప్ర‌కాష్‌తో జ‌త‌క‌డుతుంద‌ట‌. ద‌ర్శ‌కుడు సుకుమార్ నిర్మాత‌గా సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. 2014లో త‌మిళంలో తిరుమ‌నం ఎండ్రు నిక్కా అనే చిత్రంలో న‌టించింది. మూడేళ్ళ త‌ర్వాత మ‌ళ్ళీ త‌మిళంలో న‌టించ‌డానికి సిద్ధ‌మైంది.