'ఒరేయ్ ...బుజ్జిగా'లో కీలక పాత్రలో హెబ్బాపటేల్
Send us your feedback to audioarticles@vaarta.com
`ఏమైంది ఈ వేళ`, `అధినేత`, `బెంగాల్ టైగర్`, `పంతం` వంటి సూపర్‌హిట్ చిత్రాలను నిర్మించి రీసెంట్గా కార్తి `ఖైదీ` చిత్రాన్ని తెలుగులో సమర్పించి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధా మోహన్. ప్రస్తుతం రాజ్‌తరుణ్, మాళవికా నాయర్ హీరో హీరోయిన్లుగా లక్ష్మీ కె.కె. రాధామోహన్ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై `గుండె జారి గల్లంతయ్యిందే', 'ఒక లైలా కోసం` వంటి రొమాంటిక్ ఎంటర్‌టైనర్స్‌ను అందించిన దర్శకుడు కొండా విజయ్‌కుమార్ తెరక్కిస్తున్న చిత్రం. `ఒరేయ్ బుజ్జిగా`. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో ఓ కీలక పాత్రలో `కుమారి 21 ఎఫ్` ఫేమ్ హెబ్బా పటేల్ నటిస్తున్నారు. తాజా షెడ్యూల్లో ఈరోజు నుండి నుండి హెబ్బా పటేల్ యూనిట్‌తో జాయిన్ అయ్యారు. ఆమెపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా..
చిత్ర నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ - ``మా బ్యానర్లో రూపొందుతోన్న `ఒరేయ్ బుజ్జిగా` షూటింగ్ అనుకున్న ప్లానింగ్ ప్రకారం జరుగుతుంది. రాజ్‌తరుణ్ సరసన మాళవికా నాయర్ హీరోయిన్గా నటిస్తుండగా కీలకమైన పాత్రలో `కుమారి 21 ఎఫ్` చిత్రంతో యూత్‌కి దగ్గరైన హీరోయిన్ హెబ్బా పటేల్ నటిస్తున్నారు. మాళవికా, హెబ్బా పటేల్ ఇద్దరి పాత్రలకు ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ సందర్భంగా కథ నచ్చి సినిమా చేయడానికి ఒప్పుకున్న హెబ్బాపటేల్‌కు థ్యాంక్స్. సినిమాను ఎంటర్టైనింగ్గా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా దర్శకుడు కొండా విజయ్‌కుమార్ తెరకెక్కిస్తున్నారు`` అన్నారు.
యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్, హెబ్బాపటేల్, వాణీ విశ్వనాథ్, నరేష్, పోసాని కృష్ణమురళి, అనీష్ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్ ఘోష్, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, మాటలు: నంద్యాల రవి, ఫోటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, డాన్స్: శేఖర్, ఆర్ట్: టి.రాజ్‌కుమార్, ఫైట్స్: రియల్ సతీష్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఎం.శ్రీనివాసరావు(గడ్డం శ్రీను), కో-డైరెక్టర్: వేణు కూరపాటి, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్, నిర్మాత: కె.కె.రాధామోహన్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొండా విజయ్‌కుమార్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments