డిజిట‌ల్ రంగంలోకి మ‌రో హీరోయిన్‌..

  • IndiaGlitz, [Thursday,December 19 2019]

'అలా ఎలా?'తో హీరోయిన్‌గా తెలుగులో కెరీర్‌ను స్టార్ట్ చేసిన హెబ్బా ప‌టేల్ నెక్ట్స్ మూవీ 'కుమారి 21 ఎఫ్‌', 'ఆడోర‌కం ఈడోర‌కం', 'ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా' చిత్రాల‌తో స‌క్సెస్‌ను సొంతం చేసుకుని అంద‌రి దృష్టిని త‌న వైపుకు తిప్ప‌కుంది. అయితే త‌ర్వాత ఈమె న‌టించిన 'నాన్న నేను నా భాయ్‌ఫ్రెండ్‌' 'మిస్ట‌ర్‌', 'అంద‌గాడు', 'ఎంజ‌ల్‌' చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద ప్లాప్ కావ‌డంతో ఈమెకు అవ‌కాశాలు రాలేదు. ఒక అడుగు ముందుకేసి '24 కిస్సెస్‌' చిత్రంలో బోల్డ్‌గా న‌టించిన‌ప్ప‌టికీ సినిమా డిజాస్ట‌ర్ కావ‌డంతో హెబ్బా అస‌లు ఆవిర‌య్యాయి. ప్ర‌స్తుతం ఈమె నితిన్ చిత్రం 'భీష్మ‌'లో న‌టిస్తుంది.

లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ అమ్మ‌డు ఇప్పుడు వెండితెర నుండి ఓటీటీ రంగంలోకి అడుగు పెట్టింది. సినిమా రంగానికి ధీటుగా డెవ‌ల‌ప్ అవుతోన్న డిజిట‌ల్ ఫ్లాట్‌ఫామ్‌లో ఓ వెబ్‌సిరీస్‌లో న‌టిస్తోంది. ద‌డ ఫేమ్ అజ‌య్ భూయాన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ రూపొందుతోన్న వెబ్‌సిరీస్‌లో హెబ్బా న‌టిస్తుంది. ఈ వెబ్ సిరీస్‌లో ఈమెతో పాటు న‌వ‌దీప్‌, చాందిని చౌద‌రి, బిందు మాధ‌వి త‌దిత‌రులు నటిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ వెబ్ సిరీస్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.