డిజిటల్ రంగంలోకి మరో హీరోయిన్..
Send us your feedback to audioarticles@vaarta.com
`అలా ఎలా?`తో హీరోయిన్గా తెలుగులో కెరీర్‌ను స్టార్ట్ చేసిన హెబ్బా పటేల్ నెక్ట్స్ మూవీ `కుమారి 21 ఎఫ్`, `ఆడోరకం ఈడోరకం`, `ఎక్కడికి పోతావు చిన్నవాడా` చిత్రాలతో సక్సెస్‌ను సొంతం చేసుకుని అందరి దృష్టిని తన వైపుకు తిప్పకుంది. అయితే తర్వాత ఈమె నటించిన `నాన్న నేను నా భాయ్‌ఫ్రెండ్` `మిస్టర్`, `అందగాడు`, `ఎంజల్` చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్లాప్ కావడంతో ఈమెకు అవకాశాలు రాలేదు. ఒక అడుగు ముందుకేసి `24 కిస్సెస్` చిత్రంలో బోల్డ్‌గా నటించినప్పటికీ సినిమా డిజాస్టర్ కావడంతో హెబ్బా అసలు ఆవిరయ్యాయి. ప్రస్తుతం ఈమె నితిన్ చిత్రం `భీష్మ`లో నటిస్తుంది.
లేటెస్ట్ సమాచారం మేరకు ఈ అమ్మడు ఇప్పుడు వెండితెర నుండి ఓటీటీ రంగంలోకి అడుగు పెట్టింది. సినిమా రంగానికి ధీటుగా డెవలప్ అవుతోన్న డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో ఓ వెబ్‌సిరీస్‌లో నటిస్తోంది. దడ ఫేమ్ అజయ్ భూయాన్ దర్శకత్వంలో ఓ రూపొందుతోన్న వెబ్‌సిరీస్‌లో హెబ్బా నటిస్తుంది. ఈ వెబ్ సిరీస్‌లో ఈమెతో పాటు నవదీప్, చాందిని చౌదరి, బిందు మాధవి తదితరులు నటిస్తున్నారు. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments