హెబ్బా అతనితోనే డేట్ కు వెళుతుందట...
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ మధ్య యూత్ డేట్ చేయడం సర్వసాధారణమైపోయింది. ఇదే విషయాన్ని కుర్ర హీరోయిన్స్ తమకు పలానా వారితో డేటింగ్ చేయాలనుందని ఓపెన్‌గానే చెబుతున్నారు. అలా చెప్పే ముద్దుగుమ్మల లిస్టులో హెబ్బా పటేల్ కూడా చేరింది. రాజ్‌తరుణ్, నిఖిల్ ల్లో ఎవరితో డేటింగ్ చేయాలనుకుంటువని అడిగితే రాజ్ తరుణ్‌తో డేటింగ్ చేయడానికి ఇష్టపడతానని తడుముకోకుండా చెప్పేసిందట. ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా ప్రమోషన్లో భాగంగా యాంకర్ అడిగిన ప్రశ్నకు హెబ్బా గడుసుగానే సమాధానం చెప్పింది మరి...
కుమారి 21 ఎఫ్ చిత్రంతో యూత్‌తో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ హెబ్బాపటేల్ తర్వాత ఈడోరకం-ఆడోరకం సినిమాలో కూడా రాజ్‌తరుణ్‌తో జతకట్టింది. ఇది గాక వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో రాజ్‌తరుణ్‌తో మూడోసారి నటిస్తుంది. ప్రస్తుతం నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్ సినిమా చేస్తున్న హెబ్బా నిఖిల్‌తో నటించిన ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా నవంబర్ 18న విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com