నాగఅన్వేష్ కి జోడిగా హెబ్బాపటేల్
Send us your feedback to audioarticles@vaarta.com
వినవయ్యా రామయ్య ఫేమ్ నాగ అన్వేష్ రెండో సినిమా పనులు శరవేగంగా జరుతున్నాయి. సరస్వతి ఫిల్మ్స్ బ్యానర్ పై సింధురపువ్వు కృష్ణారెడ్డి నిర్మాతగా రాజమౌళి శిష్యుడు 'బాహుబలి' పళని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. త్వరలో సెట్స్ పైకి రాబోతున్న ఈ సినిమాలో నాగఅన్వేష్ సరసన హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. యాక్షన్, కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు 'ఏంజిల్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
బాలనటుడిగానే కాక తొలిచిత్రంతోనే హీరోగాను మెప్పించిన నాగ అన్వేష్ ఈసారి ఓ వినూత్నమైన స్టోరీతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. యాక్షన్, కామెడీ, లవ్, సెంటిమెంట్ ఇలా నవరసాలు సమపాల్లలో ఉండే విధంగా ఈ చిత్రం రూపొందనుంది. అలానే నాగ అన్వేష్, హెబ్బా పటేల్ జోడీ యూత్ కి ఫుల్ కిక్ ఇస్తోందని చిత్ర బృందం చెబుతోంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని దర్శకనిర్మాతలు తెలియజేశారు..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments