RajahmundryBridge: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. రాజమండ్రి రోడ్ కం రైల్ బ్రిడ్జిపై ఆ వాహనాల ప్రవేశంపై నిషేధం

  • IndiaGlitz, [Monday,July 24 2023]

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రఖ్యాత రాజమండ్రి - కొవ్వూరు రోడ్ కం రైల్ వంతెనపై అధికారులు ఆంక్షలు విధించారు. ఇకపై భారీ వాహనాలకు అనుమతి లేదని జిల్లా కలెక్టర్ డా.కే. మాధవీలత ఆదేశాలు జారీ చేశారు. కేవలం ద్విచక్ర వాహనాలు, కార్లు మినహా ఇతర భారీ వాహనాలకు బ్రిడ్జిపైకి అనుమతి లేదని పేర్కొన్నారు. రోడ్ కం రైల్వే బ్రిడ్జి నిర్మాణం పూర్తయిన తర్వాత 1974 నుంచి వాహనాలు దీని మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. దీని జీవితకాలాన్ని ఇంజనీర్లు 65 ఏళ్లుగా నిర్ణయించారు. ఇందులో ఇప్పటికే 49 ఏళ్లు పూర్తవుతోంది. దీనికి తోడు రోజురోజుకు ట్రాఫిక్ , వాహన రాకపోకలు పెరుగుతున్నాయి.

భారీ వాహనాల కారణంగా వంతెనకు ప్రమాదం:

రోడ్ కం రైల్వే బ్రిడ్జీపై భారీ వాహనాలు రాకపోకలు పెరుగుతుండటంతో డెక్ జాయింట్‌లు, గడ్డర్లు దెబ్బతింటున్నాయని రోడ్లు, భవనాల శాఖ పరిశీలనలో తేలింది. వంతెన మీదుగా 10.2 టన్నుల బరువుకు మించిన వాహనాలు తిరిగితే వంతెన దెబ్బ తినే అవకాశం వుందని 2007, 2011 సమయంలో నిపుణుల కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ క్రమంలో రోడ్లు భవనాల శాఖ సిఫారసు మేరకు వంతెనపైకి భారీ వాహనాల రాకపోకలను నిషేధించినట్లు జిల్లా కలెక్టర్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ వంతెన మరిన్ని సంవత్సరాల పాటు ప్రజలకు అందుబాటులో వుండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. టూ వీలర్స్, త్రి వీలర్స్, కార్లు తిరిగేలా ట్రాఫిక్ నిబంధనలను అమలు చేస్తామని కలెక్టర్ వెల్లడించారు.

గామన్ బ్రిడ్జిపైనే భారీ వాహనాలకు అనుమతి :

అనుమతించిన వాహనాలు వంతెనపై రాకపోకలు సాగించేందుకు వీలుగా బ్రిడ్జి మధ్యలో పోల్స్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ, జిల్లా రవాణా అధికారి, జిల్లా ప్రజా రవాణా అధికారి (ఆర్టీసీ) తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇకపై కొవ్వూరు - రాజమహేంద్రవరం మీదుగా ప్రయాణం చేసే భారీ వాహనాలు , బస్సులు జాతీయ రహదారిపై వున్న నాలుగు లైన్ల వంతెన (గామన్ బ్రిడ్జి)పై రాకపోకలు సాగించాలని కలెక్టర్ సూచించారు.

More News

YS Viveka:వివేకా హత్య కేసు .. నాలుగేళ్లుగా ఏం తేల్చింది, సీబీఐ ట్రాక్ తప్పిందంటూ ఎండగట్టిన 'ది వైర్'

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్.. సింపుల్‌గా (సీబీఐ). ఈ పేరు వినగానే మిస్టరీ కేసులను విప్పిన వైనం, అంతుచిక్కని నేరాల్లో నేరస్తులను పట్టుకున్న నేర్పరితనం

Vrushabha:మోహన్‌లాల్ పాన్ ఇండియా మూవీ ‘‘వృషభ’’ మొదలు.. ది కంప్లీట్ స్టార్‌తో మేకా రోషన్, క్యాస్టింగ్ ఇదే

ప్రస్తుతం బాలీవుట్ నుంచి కోలీవుడ్ వరకు పాన్ ఇండియా మూవ్‌మెంట్ నడుస్తున్న సంగతి తెలిసిందే.

Thiruveer:హ్యాపీ బ‌ర్త్ డే టు వెర్స‌టైల్ యాక్ట‌ర్ తిరువీర్‌.. ‘మిషన్ తషాఫి’లో తిరువీర్ క్యారెక్ట‌ర్‌ను అనౌన్స్ చేసిన జీ 5

తిరువీర్‌.. ఇప్పుడు తెలుగు సినిమాల్లో వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకుంటూ విల‌క్ష‌ణ న‌టుడిగా త‌న‌దైన గుర్తింపును సంపాదించుకున్నారు.

Natho Nenu Review: ‘నాతో నేను’ మూవీ రివ్యూ

దాదాపు దశాబ్ధ కాలంగా తెలుగువారికి నవ్విస్తున్న జబర్దస్త్ ద్వారా ఎంతోమంది కళాకారులు పరిచయమయ్యారు.

Pawan Kalyan :మైడియర్ వాట్సన్ .. ఈ మూడు ప్రశ్నలకు సమాధానాలు చెప్పు , జగన్ టార్గెట్‌గా వాలంటీర్లపై పవన్ మరో ట్వీట్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.