Rain in Hyderabad: హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. బయటకు రావొద్దని హెచ్చరిక..
Send us your feedback to audioarticles@vaarta.com
హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండ దంచికొట్టగా ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్టుగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ ఎత్తున వర్షం పడింది. దీంతో నగరం మొత్తం తడిసిముద్దయింది. రోడ్లన్ని వర్షపు నీటితో నిండిపోయాయి. పలు చోట్లలో రోడ్లపై పెద్దఎత్తున వర్షపు నీరు నిలవటంతో.. భారీగా ట్రాఫిక్ జామైంది. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, కూకట్ పల్లి, నిజాంపేట, జీడిమెట్ల, సికింద్రాబాద్, తదితర ప్రాంతాల్లోనూ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.
భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో నగరవాసులు జాగ్రత్తగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అవసరమైతే తప్ప బయటి రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. రాత్రి సమయంలోనూ భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయని.. అత్యవసరం అయితేనే బయటకు రావాలని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావటంతో రోడ్లపై తీవ్రస్థాయిలో ట్రాఫిక్ జాం అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని నీళ్లు నిలిచే ప్రాంతాల్లో నిదానంగా వెళ్లాలని సూచిస్తున్నారు.
అటు తెలంగాణలోని జిల్లాల్లోనూ భారీ వర్షం కురుస్తోంది. మరో ఐదు రోజుల పాటు వానలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. పిడుగులు పడే అవకాశం ఉందని రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా గొర్రెల కాపరులు అప్రమత్తంగా ఉండాలన్నారు. మరోవైపు భారీ వర్షం కారణంగా ఇవాళ రాత్రి 7 గంటలకు ఉప్పల్ స్టేడియంలో ప్రారంభం కావాల్సిన సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే గ్రౌండ్‌లో భారీగా వర్షం చేరింది. దీంతో ఆ నీటిని బయటకు తోడి.. పిచ్‌ను ఆరబెట్టాల్సి ఉంటుంది. అయితే సాయంత్రం మరోసారి వర్షం పడితే మ్యాచ్‌కు తీవ్ర ఆటంకం కలగొచ్చు. హైదరాబాద్ ప్లేఆఫ్స్ చేరుకోవాలంటే సన్‌రైజర్స్ ఈ మ్యాచ్‌లో గెలవాల్సి ఉంటుంది. ఇక ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి వైదొలిగిన టైటాన్స్‌కు ఈ సీజన్లో ఇదే చివరి మ్యాచ్. దీంతో ఆ టీంకు ఎలాంటి నష్టం ఉండదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout