Heavy Rain HYD:హైదరాబాద్‌లో దంచికొట్టిన భారీ వర్షం : కొట్టుకుపోయిన బైకులు, కార్లు.. తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్

  • IndiaGlitz, [Saturday,April 29 2023]

హైదరాబాద్‌ను భారీ వర్షం వణికించింది. శనివారం పొద్దుపొద్దున్నే నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పొద్దుపొద్దున్నే ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్డుల, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అమీర్‌పేట్, పంజాగుట్ట, యూసుఫ్‌గూడ, ఉప్పల్, సికింద్రాబాద్, బేగంపేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, రామంతపూర్, నల్లకుంట, హిమాయత్ నగర్, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో 3 గంటల పాటు కుండపోత వర్షం కురిసింది. దీంతో ఉదయాన్నే పనులకు వెళ్లాల్సిన కార్మికులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పలు చోట్ల నాలాలు ఉప్పొంగడంతో బైకులు, కార్లు కొట్టుకుపోయాయి. చాలా ప్రాంతాల్లో మోకాలు లోతులో వర్షపు నీరు పోటెత్తడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

చిన్నారిని మింగేసిన మ్యాన్‌హోల్ :

మరోవైపు భారీ వర్షం కారణంగా సికింద్రాబాద్‌లో మ్యాన్‌హోల్‌లో పడి ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. కళాసిగూడకు చెందిన మౌనిక అనే చిన్నారి ఉదయాన్నే పాల ప్యాకెట్ కోసం బయటకు వెళ్లింది. ఈ క్రమంలో భారీ వర్షం కారణంగా మ్యాన్ హోల్ మూత తెరిచి వుండటంతో చిన్నారి ప్రమాదవశాత్తూ అందులో పడిపోయింది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన డీఆర్ఎఫ్ సిబ్బంది.. పార్క్‌లైన్ వద్ద చిన్నారి మృతదేహాన్ని గుర్తించింది. పాప మృతితో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ :

ఇకపోతే.. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పలు చోట్ల పిడుగులు, వడగాళ్ల వాన పడుతుందని హెచ్చరించింది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా వుండాలని.. అత్యవసరమైతేనే తప్పించి బయటకు రాకూడదని వాతావరణ శాఖ హెచ్చరించింది.

More News

Shirdi:సాయి భక్తులకు అలర్ట్ .. షిర్డీలో మే 1 నుంచి నిరవధిక బంద్, ఎందుకంటే..?

షిర్డీ సాయి భక్తులకు షాకింగ్ న్యూస్. షిర్డీ గ్రామస్తులు మే 1 నుంచి నిరవధిక బంద్ పాటించాలని నిర్ణయించారు.

RC16:చరణ్- బుచ్చిబాబు మూవీ .. అది కోడి రామ్మూర్తి బయోపిక్ కాదు, క్లారిటీ ఇచ్చిన చెర్రీ టీమ్

టాలీవుడ్‌లో దర్శకుల పరిస్ధితి విచిత్రంగా వుంటుంది. సాధారణంగా ఫ్లాప్‌లు ఇచ్చిన దర్శకులకు మరో ఆఫర్ రావడం కష్టం.

Producer Abhishek Agarwal:నిర్మాతలను గౌరవించేది ఇలాగేనా.. ఫిల్మ్ ఫేర్ నిర్వాహకులపై ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్ ఆగ్రహం

68వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ వేడుకలు వివాదాస్పదమవుతున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘‘ది కాశ్మీర్ ఫైల్స్’’ చిత్రానికి ఫిల్మ్ ఫేర్ అవార్డ్ దక్కగా..

Weather Forecast : మరో ఆరు రోజులు వానలే వానలు .. తెలంగాణ రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్

భానుడి భగభగలతో దేశం మొత్తం అల్లాడుతుంటే తెలంగాణలో మాత్రం విచిత్ర వాతావరణం నెలకొంది.

Telangana Secretariat:తెలంగాణ కొత్త సచివాలయం ఓపెనింగ్.. ఫ్లోర్‌ల వారీగా శాఖల కేటాయింపు, కేసీఆర్ ఆఫీస్ ఎక్కడ..?

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైన సంగతి తెలిసిందే.