Heavy Rain HYD:హైదరాబాద్‌లో దంచికొట్టిన భారీ వర్షం : కొట్టుకుపోయిన బైకులు, కార్లు.. తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్
Send us your feedback to audioarticles@vaarta.com
హైదరాబాద్‌ను భారీ వర్షం వణికించింది. శనివారం పొద్దుపొద్దున్నే నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పొద్దుపొద్దున్నే ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్డుల, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అమీర్‌పేట్, పంజాగుట్ట, యూసుఫ్‌గూడ, ఉప్పల్, సికింద్రాబాద్, బేగంపేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, రామంతపూర్, నల్లకుంట, హిమాయత్ నగర్, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో 3 గంటల పాటు కుండపోత వర్షం కురిసింది. దీంతో ఉదయాన్నే పనులకు వెళ్లాల్సిన కార్మికులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పలు చోట్ల నాలాలు ఉప్పొంగడంతో బైకులు, కార్లు కొట్టుకుపోయాయి. చాలా ప్రాంతాల్లో మోకాలు లోతులో వర్షపు నీరు పోటెత్తడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చిన్నారిని మింగేసిన మ్యాన్‌హోల్ :
మరోవైపు భారీ వర్షం కారణంగా సికింద్రాబాద్‌లో మ్యాన్‌హోల్‌లో పడి ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. కళాసిగూడకు చెందిన మౌనిక అనే చిన్నారి ఉదయాన్నే పాల ప్యాకెట్ కోసం బయటకు వెళ్లింది. ఈ క్రమంలో భారీ వర్షం కారణంగా మ్యాన్ హోల్ మూత తెరిచి వుండటంతో చిన్నారి ప్రమాదవశాత్తూ అందులో పడిపోయింది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన డీఆర్ఎఫ్ సిబ్బంది.. పార్క్‌లైన్ వద్ద చిన్నారి మృతదేహాన్ని గుర్తించింది. పాప మృతితో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ :
ఇకపోతే.. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పలు చోట్ల పిడుగులు, వడగాళ్ల వాన పడుతుందని హెచ్చరించింది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా వుండాలని.. అత్యవసరమైతేనే తప్పించి బయటకు రాకూడదని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com