Sikkim:సిక్కింను ముంచెత్తిన భారీ వరదలు.. 23 మంది జవాన్లు గల్లంతు

  • IndiaGlitz, [Wednesday,October 04 2023]

ఈశాన్య రాష్ట్రమైన సిక్కింను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. మంగళవారం రాత్రి నుంచి కుండపోత వర్షం కురుస్తుండడంతో లాచెన్ లోయలోని తీస్తా నది నీటిమట్టం ఒక్కసారిగా పెరిగింది. ఓవైపు భారీ వర్షాలకు తీస్తా నది నీటి మట్టం పెరగడం, మరోవైపు చుంగ్‌థాంగ్ డ్యామ్ నుంచి నీటిని కిందికి విడుదల చేయడంతో అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో మెరుపు వరదలు సంభవించాయి. ఆకస్మిక వరదల వల్ల నది తీరాన ఉన్న ఆర్మీ క్యాంప్ వాహనాలు కొట్టుకుపోయాయి. దీంతో 23 మంది భారత జవాన్లు వరద నీటిలో కొట్టుకుపోయారు. వారి ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు రక్షణశాఖ వర్గాలు ప్రకటించాయి.

వరదలతో సిక్కింలో హైఅలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం..

ఈ వరదల కారణంగా మొత్తం 41 వాహనాలు నీటిలో మునిగిపోయినట్లు వెల్లడించాయి. ప్రస్తుతం వరదలు సంభవించిన ప్రాంతంలో ఇంటర్నెట్ సదుపాయం కూడా సరిగ్గా లేదని.. దీంతో గల్లంతైన సిబ్బందిని గుర్తించడం కష్టంగా మారిందని తెలిపాయి. తీస్తా నది ముందు సిక్కిం, పశ్చిమ బెంగాల్ గుండా బంగ్లాదేశ్‌లోకి ప్రవహిస్తుంది. తీస్తా నది ఉగ్రరూపం దాల్చడంతో సింగ్తమ్ ఫ్రూట్ బ్రిడ్జి కుప్పకూలింది. దాంతో సిక్కిం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలను కలిపే 10వ నంబర్ జాతీయ రహదారి సైతం చాలా చోట్ల కొట్టుకుపోయింది. భారీ వర్షాల నేపథ్యంలో సిక్కిం ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. నది పరివాహక ప్రాంతంలోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించింది. ఇప్పటికే అధికారులు చాలా మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

జూన్‌లోనూ మెరుపు వరదలతో భారీగా చిక్కుకుపోయిన పర్యాటకులు..

మరోవైపు పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి సహాయక చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమంగ్ తెలిపారు. ఇదే ఏడాది జూన్‌లో ఉత్తర సిక్కిం ప్రాంతం భారీ వర్షాల కారణంగా మెరుపు వరదలను ఎదుర్కొంది. నదులు పొంగిపొర్లడంతో లాచెన్, లాచుంగ్ వంటి ప్రాంతాలకు రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల నుంచి సంబంధాలు తెగిపోయాయి. ఈ ఆకస్మిక వరదల కారణంగా 2,400 మంది పర్యాటకులు ఈ ప్రాంతంలో చిక్కుకుపోయారు. సహాయక చర్యల కోసం సైన్యాన్ని రంగంలోకి దించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఏకంగా సైనికులే గల్లంతు కావడంపై ఆందోళన నెలకొంది.

More News

Bigg Boss 7 Telugu : బిగ్‌బాస్ హౌస్‌లో తొలి కెప్టెన్సీ టాస్క్.. శోభాశెట్టి చీటింగ్, ఏం మనుషుల్రా అంటూ శివాజీ అసహనం

బిగ్‌బాస్ హౌస్‌లో ఈ వారం నామినేషన్స్ చప్పగా సాగడంతో ప్రేక్షకులు నిరుత్సాహాపడ్డారు. బిగ్‌బాస్ షోను ప్రతి సోమవారం, వీకెండ్‌లలో ఎవ్వరూ మిస్ కారు.

Ram Charan:మరో గుర్రాన్ని కొనుగోలు చేసిన చరణ్.. నా కొత్త ఫ్రెండ్ అంటూ పోస్ట్, బ్లాక్ డ్రెస్‌లో గ్లోబల్ స్టార్ స్టైలిష్ లుక్

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ తేజ్‌కు సినిమాలు, వ్యాపారాలతో పాటు జంతువులతో గడపడం చాలా ఇష్టం .

Minister Roja:కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి రోజా.. మీ ఇంట్లో ఆడవాళ్లకు కూడా ఇలాగే జరిగితే ఊరుకుంటారా..?

మాజీ మంత్రి బండారు సత్యనారాయణ తనపై చేసిన వ్యాఖ్యలను మంత్రి రోజా తీవ్రంగా ఖండించారు.

Chiranjeevi : త్రివిక్రమ్ డైరెక్షన్‌లో మెగాస్టార్ .. అలాంటి ఇలాంటి ప్రాజెక్ట్ కాదు..!!

ఆసక్తికరమైన కథలకు, పంచ్ డైలాగ్‌లకు పెట్టింది పేరు త్రివిక్రమ్. ఆయన కలం నుంచి వచ్చే పవర్ ఫుల్ డైలాగ్స్‌ ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తాయి.

Nobel Prizes:భౌతిక శాస్త్రంలో ముగ్గురిని వరంచిన నోబెల్ బహుమతులు

2023 సంవత్సరానికి గాను భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి అవార్డును రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది.