Fire Accident: సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. ఏడుగురు మృతి..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలోని ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ వద్ద ఉన్న ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో ఈ ప్రమాదం జరిగింది. పరిశ్రమలోని రియాక్టర్ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మేనేజర్‌గా పనిచేస్తున్న రవి మృతి చెందాడు. ఆయనతో పాటు ఇప్పటివరకూ ఏడుగురు వ్యక్తులు చనిపోయినట్లు తెలుస్తోంది. మరో 10 మంది వరకు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. మంటలు పక్కన ఉన్న పరిశ్రమలకు వ్యాపిస్తుండటంతో పోలీసులు అక్కడ ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతదేహాలను సంగారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించగా మృతుల కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో 50 మంది కంపెనీ లోపల ఉన్నట్లు సమాచారం. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోవడంతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది.
రోజూ లాగే ఫ్యాక్టరీలో కార్మికులు పనిచేస్తుండగా.. ఒక్కసారిగా రియాక్టర్ పేలిందని ప్రత్యక్ష సాక్ష్యులు వెల్లడించారు. రియాక్టర్ పేలుడు ధాటికి పక్కనే ఉన్న పలు నిర్మాణాలు కూలిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఈ క్రమంలోనే ఫ్యాక్టరీ సమీపంలోని ఇళ్లల్లో ఉన్న ప్రజలను అధికారులు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని సంగారెడ్డి ఎస్పీ రూపేశ్, పటాన్‌చెరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి, మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు పరిశీలించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments