Fire Accident: సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. ఏడుగురు మృతి..

  • IndiaGlitz, [Wednesday,April 03 2024]

తెలంగాణలోని ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ వద్ద ఉన్న ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో ఈ ప్రమాదం జరిగింది. పరిశ్రమలోని రియాక్టర్ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మేనేజర్‌గా పనిచేస్తున్న రవి మృతి చెందాడు. ఆయనతో పాటు ఇప్పటివరకూ ఏడుగురు వ్యక్తులు చనిపోయినట్లు తెలుస్తోంది. మరో 10 మంది వరకు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. మంటలు పక్కన ఉన్న పరిశ్రమలకు వ్యాపిస్తుండటంతో పోలీసులు అక్కడ ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన పలువురి పరిస్థితి విష‌మంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృత‌దేహాల‌ను సంగారెడ్డి ఏరియా ఆసుపత్రికి త‌ర‌లించగా మృతుల కుటుంబాల్లో విషాద‌ఛాయ‌లు అలముకున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో 50 మంది కంపెనీ లోపల ఉన్నట్లు సమాచారం. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోవడంతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది.

రోజూ లాగే ఫ్యాక్టరీలో కార్మికులు పనిచేస్తుండగా.. ఒక్కసారిగా రియాక్టర్ పేలిందని ప్రత్యక్ష సాక్ష్యులు వెల్లడించారు. రియాక్టర్ పేలుడు ధాటికి పక్కనే ఉన్న పలు నిర్మాణాలు కూలిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఈ క్రమంలోనే ఫ్యాక్టరీ సమీపంలోని ఇళ్లల్లో ఉన్న ప్రజలను అధికారులు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని సంగారెడ్డి ఎస్పీ రూపేశ్‌, పటాన్‌చెరు డీఎస్పీ రవీందర్‌ రెడ్డి, నర్సాపూర్‌ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి, మెదక్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు పరిశీలించారు.

More News

అక్రమాస్తుల కేసులో రెరా మాజీ కార్యదర్శి శివబాలకృష్ణకు బెయిల్

అక్రమాస్తుల కేసులో అరెస్టైన రెరా మాజీ కార్యదర్శి శివబాలకృష్ణకు భారీ ఊరట దక్కింది. నిర్ణీత సమయం 60 రోజుల్లో ఛార్జీషీట్ దాఖలు చేయకపోవడంతో బెయిల్ మంజూరైంది.

జూనియర్ ఎన్టీఆర్ ఇంటిముందు నిరాహార దీక్ష చేస్తా: కోన వెంకట్

టాలీవుడ్ రైటర్ కోన వెంకట్ పలు హిట్ సినిమాలకు కథ, మాటలు అందించిన సంగతి తెలిసిందే. ఆయన మాటలు అందించిన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.

Konda Surekha: ట్యాపింగ్ ఆరోపణలపై మంత్రి కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు

ఫోన్ ట్యాపింగ్‌ విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి, సీనియర్ నేత కేకే మహేందర్‌ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు.

Pawan Kalyan: జనసేనాని పవన్ కల్యాణ్‌కు తీవ్ర జ్వరం.. ఎన్నికల ప్రచారం నిలిపివేత..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఈ నేపథ్యంలో బుధవారం తెనాలిలో జరగాల్సిన ర్యాలీ

Killi Kruparani: వైసీపీకి మరో షాక్.. కేంద్ర మాజీ మంత్రి రాజీనామా..

ఎన్నికల సమయంలో అధికార వైసీపీకి మరో షాక్ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను