Telangana Elections:తెలంగాణ ఎన్నికలపై జోరుగా బెట్టింగ్‌లు.. వేల కోట్లలో దందా..

  • IndiaGlitz, [Wednesday,November 29 2023]

తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగిసింది. పోలింగ్‌కు ఒక్క రోజు మాత్రమే సమయం ఉంది. ఇంకేముంది బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. రండి బాబు రండి.. కాయ్ రాజా కాయ్.. ఈ ఎమ్మెల్యే మీద కోటి రూపాయలు.. ఆ ఎమ్మెల్యే మీద రెండు కోట్లు.. కోటికి కోటిన్నర రూపాయలు.. ఇది బెట్టింగ్ ముఠా సాగిస్తున్న దందా. ఇప్పటికే తెలంగాణ ఎన్నికలపై దాదాపు రూ.2,500కోట్ల వరకు బెట్టింగ్ జరిగిందని.. ఈనెల 30న ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యే దగ్గరి నుంచి ఫలితాలు వచ్చే వరకు రూ.10వేల కోట్లకు బెట్టింగ్ దందా దాటినా ఆశ్చర్యం పడాల్సిన అవసరం లేదని ఓ మాజీ ఐపీఎస్ అధికారి తెలిపారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

తెలంగాణలో బెట్టింగ్‌ నిర్వహిస్తే పట్టుబడే అవకాశం ఉందని గుర్తించిన బుకీలు ఇతర ప్రాంతాల నుంచి దందా సాగిస్తున్నట్లు సమాచారం. ఏపీ, ముంబై, ఢిల్లీ, కోల్‌కతాతో పాటు దేశంలోని పలు ఇతర నగరాల నుంచి ఇది జరుగుతున్నట్లు తెలుస్తోంది. కొందరు బుకీలు లండన్‌, అమెరికాల నుంచి యాప్‌ల ద్వారా బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇక పందేలకు పెట్టింది పేరైన పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో తెలంగాణ ఎన్నికలపై జోరుగా పందేలు జరుగుతున్నాయి. బడాబాబులు రూ.లక్షలు, కోట్లలో కడుతుంటే.. సామాన్యులు రూ.వేలల్లో కాస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మేజిక్ ఫిగర్ దాటి అకారంలోకి వస్తుందని ఏపీకి చెందిన ఓ నాయకుడు తెలంగాణకు చెందిన నాయకుడితో రూ.2 కోట్ల వరకు పందెం కట్టినట్టు సమాచారం.

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని పందెంరాయుళ్లు ఎక్కువగా బెట్టింగ్ కాసినట్లు చెబుతున్నారు. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గెలుస్తారా..? గజ్వేల్‌లో కేసీఆర్ గెలుస్తారా..? కాంగ్రెస్‌ కంటే బీఆర్ఎస్‌కు తక్కువ సీట్లు వచ్చినా ఎంఐఎం, బీజేపీ మద్దతుతో బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుందని మరికొంతమంది పందేలు కడుతున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచేది ఎవరు? బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ కొడుతుందా? కేసీఆర్‌ మూడోసారి సీఎం అవుతారా? కాంగ్రెస్‌ గెలుస్తుందా? బీజేపీకి ఎన్ని సీట్లు వస్తా యి? ఎంఐఎం 7 స్థానాలు కాపాడుకుంటుందా? కాంగ్రెస్‌ విజయం సాధిస్తే సీఎం అభ్యర్థి ఎవరు? వంటి అంశాలపై బెట్టింగ్‌ జోరుగా సాగుతోంది. మరి ఈ ఎన్నికలు ఎంతమందిని కోటేశ్వరులను చేస్తాయో.. మరెంత మందిని రోడ్డుపైకి తెస్తాయో.. డిసెంబర్ 3వ తేదీన తేలిపోనుంది.

More News

JD Lakshminarayana:ఏపీలో మరో కొత్త పార్టీ.. జేడీ లక్ష్మీనారాయణ కీలక ప్రకటన..

తెలంగాణ ఎన్నికల వేడి ముగింపునకు వచ్చిందో లేదో ఏపీలో ఎన్నికల కాక మొదలుకానుంది.

Ramgopal Varma:ఓటుకు నోటు తీసుకోండి.. కానీ..: రాంగోపాల్ వర్మ

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఏం చేసినా స్పెషల్‌నే. అయినా ఏ విషయం గురించి మాట్లాడినా అందులో తనదైన మార్క్ ఉంటుంది.

Bigg Boss Telugu 7 : టాస్క్‌ల్లో తేలిపోయిన శివాజీ.. టికెట్ టు ఫినాలే కష్టమేనా, ప్రియాంకను నలిపేసిన అమర్‌

బిగ్‌బాస్ 7 తెలుగులో సోమవారం నామినేషన్స్ పర్వం ముగిసింది. కంటెస్టెంట్స్‌ల మధ్య గొడవలతో హౌస్ హీటెక్కిపోయింది.

Uttarakhand:ఉత్తరాఖండ్ సొరంగం ఆపరేషన్ సక్సెస్.. దేశమంతా ఆనందోత్సవాలు..

యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూసిన ఆ క్షణానికి తెరపడింది. 17రోజుల పాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్లు విజయవంతంగా ముగిశాయి.

Odiyamma:'ఒడియమ్మా'.. నాని కోసం పాట పాడిన తమిళ హీరో..

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'హాయ్ నాన్న' చిత్రం నుంచి మరో లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.