అంగారకునిపై హృదయ స్పందన శబ్ధాలు
Send us your feedback to audioarticles@vaarta.com
అంగారక గ్రహం(మార్స్)కు సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ వెలుగు చూసింది. అంగారక గ్రహంపై జీవ మనుగడ గురించి తెలుసుకునేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా) పంపిన రోవర్ పెర్సెవరెన్స్ అక్కడ పరిశోధనలు సాగిస్తోంది. ఆ గ్రహంపై ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. మట్టి నమూనా మొదలుకొని వాతావరణానికి సంబంధించిన పలు అంశాలపై ఈ పరిశోధనలు సాగుతున్నాయి. అయితే రోవర్ పెర్సెవరెన్స్ తాజాగా ఓ ఆసక్తికర ఆడియోను పంపించింది. అంగారకునిపై వినిపిస్తున్న శబ్ధాలను తొలిసారిగా రికార్డు చేసింది. వీటికి సంబంధించిన రెండు ఆడియో రికార్డులను నాసాకు పంపించింది.
రోవర్ పెర్సెవరెన్స్ మార్స్‌పై మార్చి 6 నుంచి తన పరిశోధనలు ప్రారంభించింది. అయితే గాలుల శబ్ధాలను పంపించడం మాత్రం ఇదే తొలిసారని తెలుస్తోంది. ఒక ఆడియో ద్వారా అంగారక గ్రహంపై గాలులు ఏ స్థాయిలో వీస్తున్నాయనేది అవగతమవుతోంది. ఈ ఆడియోను నాసా ట్విటర్‌లో షేర్ చేసింది. ఈ శబ్ధాలు భూమి మీద తుపాను వచ్చిన సమయంలో వచ్చే గాలుల శబ్ధాలను పోలి ఉన్నాయి. రోవర్ పెర్సెవరెన్స్ ఈ ఆడియోను సూపర్‌మ్యాక్ మైక్రోఫోన్ సాయంతో రికార్డు చేసింది. మరో ఆడియోనూ కూడా రోవర్ పెర్సెవరెన్స్ నాసాకు పంపింది. ఇది లేజర్ స్ట్రయిక్స్ మాదిరిగా వినిపిస్తోంది. గుండె కొట్టుకుంటున్నప్పుడు వచ్చే శబ్ధంలా ఈ శబ్ధం ఉండటం విశేషం. ఈ విషయాలను వెల్లడిస్తూ ‘నాసా’ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments